ఏ తల్లిదండ్రులైన తమ బిడ్డలు ఎదగాలని చూస్తుంటారు.దాంతో వాళ్లు కూడా తమ పిల్లలకు ఎంతో ప్రోత్సాహం ఇస్తుంటారు.
కానీ కొన్ని కొన్ని సార్లు తమ పిల్లలు ఊహించిన దానికంటే ఎక్కువ పని చేస్తే గర్వంగా ఫీలవుతారు.కానీ అది ప్రమాదకరమైనదని తెలిస్తే మాత్రం బాగా ఆందోళన పడుతుంటారు.
బెదిరి పోతుంటారు.ఆ పనులను అసలు చేయవద్దు అని మాట కూడా ఇస్తుంటారు.
అలా ఓసారి రామ్ చరణ్ విషయంలో కూడా చిరంజీవి అలాగే ప్రవర్తించాడట.ఇంతకూ ఏం జరిగిందో తెలుసుకుందాం.
టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి మెగాస్టార్ గా నిలిచి ఎంత మంది అభిమానులను సంపాదించుకున్నాడో అందరికీ తెలిసిందే.అతి తక్కువ సమయంలో స్టార్ హీరోగా ఎదిగి టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరో గా నిలిచాడు.
ఎన్నో సినిమాలలో నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు చిరంజీవి.తనతో పాటు తన వారసులను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు చిరు.
ప్రస్తుతం తన వారసులు కూడా వరుస సినిమాలతో బాగా బిజీగా ఉంటున్నారు.ఇక అందులో తన వారసుడు రామ్ చరణ్ మాత్రం ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకెళ్తున్నాడు.
తండ్రికి తగ్గ తనయుడుగా పేరు సంపాదించుకుంటున్నాడు.అతి తక్కువ సమయంలో రామ్ చరణ్ కూడా స్టార్ హీరోగా ఎదిగాడు.

ఇక సినిమాలలో రామ్ చరణ్ చేసే యాక్షన్ సీన్స్ మాత్రం బాగా ఆకట్టుకుంటాయి.ముఖ్యంగా ఆయన తొలిసారి నటనలోనే తన యాక్షన్ సీన్స్ తో అందర్నీ ఫిదా చేశాడు.తాను నటించిన మగధీర సినిమాలో తను చేసిన బైక్ స్టంట్ గురించి అందరికీ తెలిసిందే.నిజానికి ఆ సీన్ మాత్రం ఆ సినిమాలో బాగా హైలెట్ గా మారింది.
ఆ సీన్ చూడటానికి అలా ఉంటుంది కానీ అందులో ఉండే కష్టం గురించి నటించిన వాళ్లకు మాత్రమే తెలుస్తుంది.దీంతో రామ్ చరణ్ ఇటువంటి సాహసాలు చేయటంతో ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారని.
అందుకు రామ్ చరణ్ నటించే తర్వాత సినిమాలో కూడా ఇటువంటి సాహసమైన యాక్షన్ సీన్ ఉంటుందని తెలియటంతో వెంటనే చిరంజీవి బెదిరిపోయాడని తెలిసింది.

నిజానికి ఎవరికైనా తమ పిల్లలు అటువంటి సాహసాలు చేస్తున్నారు అంటే ఏమైనా ప్రమాదాలు జరుగుతాయన్న భయంతో అటువంటి సాహసాలకు పంపించరు.అలా చిరంజీవి కూడా గతంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన మగధీర సినిమాలో రామ్ చరణ్ చేసిన సాహసం చేసి భయపడ్డాడట.దీంతో అప్పుడే రామ్ చరణ్ కు మరో సినిమాలో కూడా ఇటువంటి సాహసంతో కూడిన సన్నివేశం ఉందని తెలియడంతో బెంగ పెట్టుకున్నాడట చిరంజీవి.

అయితే చిరంజీవి రామ్ చరణ్ కు ఇటువంటి సాహసాలు ఉన్న సన్నివేశాలకు దూరంగా ఉండమని చెప్పాడట.అలా రామ్ చరణ్ కూడా తన తండ్రి మాటకు గౌరవం ఇచ్చి అటువంటి సాహసాలు ఉండే సన్నివేశాల్లో నటించనని దర్శకులకు ముందుగానే కథ చెప్పినప్పుడు నో చెప్పేవాడట.ఇక అప్పటి నుంచి రామ్ చరణ్ ఇటువంటి సాహసాలకు దూరంగా ఉంటూ అభిమానులను నిరాశ పరుస్తున్నాడు.