ఆ పార్టీ కోసం చిరు ఇండైరెక్ట్ గా కష్టపడుతున్నాడా.. గాడ్ ఫాదర్ సినిమానే అతనికోసమా?

మెగాస్టార్ చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.ఈ క్రమంలోనే ఈయన ఇప్పటికే వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టగా తాజాగా పలు చిత్రాలు షూటింగ్ పనులను ప్రారంభం చేసుకున్నాయి.

 Chiru Working Indirectly For That Party Is God Father Movie For Him Details, Ch-TeluguStop.com

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ లూసిఫర్ చిత్రానికి రీమేక్ చిత్రంగా గాడ్ ఫాదర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ పనులలో పాల్గొంటూనే మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా షూటింగ్లో కూడా పాల్గొంటున్నారు.

ఇలా వరుస సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి కరోనా మహమ్మారి బారిన పడ్డారు.

తనకు కరోనా సోకింది అనే విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి తెలియజేస్తూ గత కొద్ది రోజుల నుంచి క్వారంటైన్ లో ఉన్న సంగతి మనకు తెలిసిందే.

ఇలా క్వారంటైన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్న ఈయనకు నెగిటివ్ రావడంతో తిరిగి సినిమా షూటింగులతో బిజీ అవుతున్నారు.ఈ క్రమంలోనే కరోనా నెగిటివ్ రావడంతోనే మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు.

ఇలా గాడ్ ఫాదర్ షూటింగ్ లొకేషన్ లోకి మెగాస్టార్ చిరంజీవి వెళ్లిన వెంటనే తెలిసి చేశారో లేక తెలియక చేశారో తెలియదు కానీ ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.

ఇలా మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ ఫోటోల ద్వారా సినిమా స్టోరీ మొత్తం కొందరు ఎంతో సునాయాసంగా చేస్తున్నారు.ఈ ఫోటోలలో కాకుండా మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో తన లుక్ ఏ విధంగా ఉంటుందో తెలిసిపోతుంది.

ఈ సినిమాలో సీఎం అయ్యే స్టామినా ఉన్నప్పటికీ తన తండ్రితో పాటు సమానమైన వ్యక్తి కోసం నిలబడి ఆ పార్టీని ముందుకు నడపడానికి ప్రయత్నాలు చేస్తుంటారు.అదే విధంగా కుటుంబ సభ్యుల సమస్యలను కూడా ఎంతో చాకచక్యంగా పరిష్కరిస్తుంటారు.

ఈ విధంగా ఈ సినిమాలో చిరంజీవి చేస్తున్న గాడ్ ఫాదర్ సినిమా కోసం జన జాగృతి అనే పార్టీని స్థాపించినట్లు ఆ పార్టీ కోసం ఇండైరెక్టుగా చిరంజీవి కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థులు ఏమాత్రం గాడి తప్పకుండా సరైన క్రమంలో ఉండేలా ఈ వ్యవహారాలను మెగాస్టార్ చిరంజీవి చూసుకుంటున్నారని తెలుస్తోంది.ఇలా ఈయన షేర్ చేసిన ఈ ఫోటోల ద్వారా చాలా మంది ఈ కథను అల్లేస్తూ మెగాస్టార్ గాడ్ ఫాదర్ సినిమా స్టోరీ ఇదే అంటూ సినిమా స్టోరీని తెలియజేస్తున్నారు.మొత్తానికి చిరంజీవి షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇక ఈయన కొరటాల శివ దర్శకత్వంలో నటించిన ఆచార్య సినిమా ఏప్రిల్ చివరి వారంలో విడుదల కానుంది.ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఓకే స్క్రీన్ పై ఈ సినిమాలో తండ్రి కొడుకులను ఇద్దరినీ చూసే అవకాశం కల్పించడంతో మెగాహీరోలు ఆచార్య సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా తర్వాత గాడ్ ఫాదర్, భోళా శంకర్ కూడా విడుదల కానున్నాయి.

Chiru Working Indirectly For That Party Is God Father Movie For Him Details, Chiranjeevi, Tollywood, Hero, Party, Godfather, Film Industry, Chiranjeevi God Father Movie, Director Mohan Raja, Bhola Shankar, Acharya Movie, God Father Shooting - Telugu Acharya, Bhola Shankar, Chiranjeevi, Chiranjeevi God, Mohan Raja, God, Godfather, Tollywood

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube