Chiranjeevi BRS Party: బీఆర్ఎస్‌లో చేరమని చిరంజీవికి ఆహ్వానం అందిందా?

తెలంగాణ మంత్రి సిహెచ్ మల్లారెడ్డి భారత రాష్ట్ర సమితిలో చేరాల్సిందిగా మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించినట్లుగా తెలుస్తుంది.తన కాలేజ్‌లో కార్యక్రమంలో మల్లా రెడ్డి మాట్లాడుతూ, “మీరు (చిరంజీవి) మన రాష్ట్ర, దేశ ప్రజలకు మీ సేవలు కావాలని.

 Chiru Invited To Join Brs Party Details, Chiranjeevi, Megastar Chiranjeevi, Bha-TeluguStop.com

బాధ్యతగలపౌరులుగా ప్రజలకు సేవ చేయడం మీ కర్తవ్యం బావించి బీఆర్ఎస్‌లో చేరాల్సిందిగా ఆహ్వనించారు.మల్లారెడ్డి యూనివర్సిటీ, ఇస్కాన్‌ ఆధ్వర్యంలో ‘కిల్‌ క్యాన్సర్‌’ అనే అంశంపై జరిగిన అవగాహన శిబిరంలో మంత్రి మాట్లాడారు.ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.2009 ఎన్నికలలో ఓటమి పాలైన తరువాత, చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీ (పిఆర్‌పి)ని కాంగ్రెస్‌లో విలీనం చేశారు, దానిలోని చాలా మంది నాయకులు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లేదా టిడిపిలోకి తిరిగి వెళ్లారు.సామాజిక న్యాయం అనే ఎజెండాతో చిరంజీవి పీఆర్పీని ప్రారంభించారు.వివిధ రాజకీయ పరిణామాల తర్వాత ప్రజా రాజ్యన్ని కాంగ్రెస్‌లో వీలినం చేయాల్పి వచ్చింది.

ఇటీవల కాంగ్రెస్ పార్టీ చిరుకు AICC ID కార్డ్‌ జారీ చేయడంతో ఆయన రాజకీయ పునరాగమనంపై ఊహాగానాలకు వచ్చాయి.అయితే ఈ ఏడాది జనవరిలో తాను రాజకీయాల్లోకి రానని చిరంజీవి స్పష్టం చేశారు.

ఇటీవల గాడ్ ఫాదర్ ఫ్రీ రీలిజ్ ఈవెంట్‌లో ప్రసంగిస్తూ, పవన్ కళ్యాణ్ పై చిరు కొన్ని కీలక రాజకీయ వ్యాఖ్యలు చేసారు, పవన్ కళ్యాణ్‌పై విశ్వాసం కనబరుస్తూ.తన తమ్ముడు నిజాయితీ గురించి తనకు చిన్నప్పటి నుంచి తెలుసని, అది ఏమాత్రం కల్మషం లేదని చిరు అన్నారు.

Telugu Bharat Rashtra, Brs, Chiranjeevi, Chiranjeevi Brs, Janasena, Malla, Pawan

పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు రాష్ట్రానికి కావాలి అన్నారు.భవిష్యత్‌లో తాను ఎక్కడికి వస్తానో అది ప్రజల కొరుకున్న విధంగా ఉంటుందన్నారు.అయితే పవన్ లాంటి వ్యక్తి రాష్ట్రాన్ని పాలించాలని తాను కోరుకుంటున్నానని, తన సోదరుడికి తన మద్దతును తెలిపానని ప్రముఖ నటుడు అన్నారు.పవన్ ఎదగాలని, బలమైన శక్తిగా ఎదగాలని తాను రాజకీయాల నుంచి తప్పుకున్నానని చిరంజీవి అన్నారు.

పవన్ కూడా ఏదో ఒకరోజు పాలనలో ఉంటాడని చిరు ధీమా వ్యక్తం చేశారు.అయితే మరి మల్లారెడ్డి ఆహ్వానంపై మెగాస్టార్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube