మలయాళంలో సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న లూసీఫర్ చిత్రాన్ని తెలుగులో గాడ్ ఫాదర్ చిత్రంగా తెరకెక్కుతోంది.మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటోంది.
ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ సినిమా హిందీ డిజిటల్ శాటిలైట్ హక్కులను ప్రముఖ సమస్థతో భారీ డీల్ కుదుర్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమాకు సంబంధించి డిజిటల్ శాటిలైట్ హక్కులకు హిందీలో ఏకంగా 45 కోట్ల ఆఫర్ వచ్చినట్లు వార్తలు వినపడుతున్నాయి.బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సినిమాలో నటించడంతో ఈ సినిమాపై బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ క్రమంలో ఈ సినిమా హిందీ రైట్స్ భారీ ధరలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ ఈ విషయం గురించి ఏ విధమైన ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాతో పాటు,భోళా శంకర్ సినిమాలో కూడా నటిస్తున్నారు.అలాగే బాబీ దర్శకత్వంలో ఒక సినిమా అదేవిధంగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు.
ఇందులో మెగాస్టార్ చిరంజీవి చెల్లెలు పాత్రలో లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.







