టాలీవుడ్ ఇండస్ట్రీలో సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ ద్వారా ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించి నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఎం.ఎస్.రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన బ్యానర్లో దేవి, దేవి పుత్రుడు, వర్షం, పౌర్ణమి, ఒక్కడు, మనసంతా నువ్వే వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలు తెరకెక్కాయి.
అయితే కొంతకాలం పాటు ప్రొడక్షన్ కి దూరంగా ఉన్నటువంటి ఎం.ఎస్.రాజు తాజాగా డర్టీ హరి అనే సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ క్రమంలోనే ఈ సినిమా త్వరలోనే విడుదల కావడంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా నిర్మాత ఎం.ఎస్.రాజు బుల్లితెర కార్యక్రమాలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు.తాజాగా ఆయన ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెస్ రాజు తన సినీ కెరీర్ గురించి వెల్లడించారు.తాను కథను నమ్మి సినిమా చేస్తానని స్టార్ హీరోలను నమ్మి సినిమాలు చేయనని తెలిపారు.నష్టాలలో ఉన్న తనకు మనసంతా నువ్వే సినిమా ఎన్నో లాభాలను తెచ్చి పెట్టిందని ఆయన గుర్తు చేసుకున్నారు.
ఇక మహేష్ బాబు ఒక్కడు సినిమాని తన బ్యానర్ లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.

ఈ సినిమా మంచి విజయం అయిన తర్వాత మరోసారి నిర్మాత ఎమ్మెస్ రాజు మహేష్ బాబుతో ఒక్క సినిమా కూడా చేయలేదు.ఇలా సినిమా చేయకపోవడానికి కారణం ఏంటి అని ప్రశ్నించగా ఆయన ఆసక్తికరమైన సమాధానం చెప్పారు.ఒక్కడు సినిమా తరువాత ఒకరు ఇద్దరు డైరెక్టర్లు వచ్చి మహేష్ కోసం కథ వినిపించారు.
అయితే తనకు కథ ఏమాత్రం నచ్చలేదు.మహేష్ బాబుతో సినిమా చేయకపోయినా పర్వాలేదు కానీ ఒక్కడు సినిమా పేరు చెడగొట్టకూడదు అనుకున్నాను.
అందుకే తరువాత తన బ్యానర్లో మహేష్ బాబుతో సినిమాలు చేయలేకపోయానని తెలిపారు.







