సినిమా ఇండస్ట్రీ ఎవరికీ దక్కునంత క్రేజ్ మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi )కి దక్కిందనే చెప్పాలి.ఎందుకంటే ఆయన అహర్నిశలు కష్టపడుతూ సినిమా కోసమే తన శ్వాస, ధ్యాస మొత్తం సినిమా మీద పెట్టి అహర్నిశలు కష్టపడ్డాడు.
కాబట్టే ఆయనకి అంతటి క్రిష్ దక్కిందని చెప్పాలి.ఇక ఒక సామాన్య మనిషి మెగాస్టార్ ఎదగడం అనేది చాలా కష్టమైన విషయం కానీ మనిషి తలుచుకుంటే ఏది కష్టం కాదు అని చిరంజీవి నిరూపించడం తో ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకోని చాలామంది సినిమా ఇండస్ట్రీకి కూడా వచ్చారు.
అందులో కొంతమంది సక్సెస్ అయితే, మరి కొంతమంది మాత్రం ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

ఇక ఇలాంటి క్రమంలోనే చిరంజీవి ఒకప్పుడు వరుస హిట్ సినిమాలు చేస్తూ ఉన్నాడు.ఆ సమయంలో యండమూరి వీరేంద్ర నాథ్( Yandamuri Veerendranath ) డైరెక్షన్ లో స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ అనే ఒక సినిమా చేశాడు.ఈ సినిమా సమయంలో యండమూరి వీరేంద్రనాథ్ కి డైరెక్షన్ మీద సరిగ్గా అవగాహన లేకపోవడం వల్ల ఈ సినిమాను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు దాంతో సినిమా ఫ్లాప్ అయింది.
ఇక ఈ సినిమా( Stuartpuram Police Station ) షూటింగ్ దశ లో ఉన్నప్పుడు చిరంజీవి అనవసరంగా ఈ సినిమాను ఒప్పుకున్నానా అని చాలా ఇబ్బంది పడ్డాడట.అయిన కూడా ప్రొడ్యూసర్లకి నష్టం రావద్దనే ఉద్దేశ్యం తో ఈ సినిమాని పూర్తి చేసి రిలీజ్ చేశారు.

సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది.ఇక ఈ ఒక్క సినిమా విషయంలోనే చిరంజీవి విపరీతంగా బాధపడ్డట్టుగా అప్పట్లో చాలా వార్తలైతే వచ్చాయి.నిజానికి యండమూరి వీరేంద్రనాథ్ ను ఎంకరేజ్ చేసి ఆయనతో డైరెక్షన్ చేయించింది కూడా చిరంజీవి గారే కానీ యండమూరి మొదట హ్యాండిల్ చేస్తానని అనుకున్నాడట.కానీ మధ్యలోకి వచ్చేసరికి ఆయన అంత కన్ఫ్యూజ్ అవడంతో నావల్ల కాదు అని చేతులెత్తేశాడు ఇక మొత్తానికి అయితే చిరంజీవికి ఒక భారీ ఫ్లాప్ వచ్చిందనే చెప్పాలి…
.