మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా “వాల్తేరు వీరయ్య” జనవరి 13వ తారీకు రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో చిరంజీవితో పాటు మాస్ మహారాజ రవితేజ కూడా కీలక పాత్ర చేయడం జరిగింది.
శృతిహాసన్, కేథరిన్ తెరిసా హీరోయిన్ లుగా నటించారు.రేపు ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక విశాఖపట్నంలో జరుగుతుంది.
అయితే ఈ క్రమంలో కొద్ది నిమిషాల క్రితం “వాల్తేరు వీరయ్య” థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది.
ట్రైలర్ లో చిరంజీవి కామెడీతో పాటు మంచి మాస్ క్యారెక్టర్ చేసినట్లు చూపించారు.
ఇంకా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రవితేజ కనిపిస్తున్నారు.నువ్వా నేనా అన్నట్టు సినిమాలో రవితేజ.
చిరంజీవి క్యారెక్టర్ లు ఉన్నట్లు ట్రైలర్ లో తెలుస్తోంది.ఇంకా ట్రైలర్ చివరిలో “ఘరానా మొగుడు” సినిమాలో డైలాగ్ నీ రవితేజ చెప్పగా… “ఇడియట్” సినిమాలో డైలాగ్ ను చిరంజీవి చెప్పటం హైలైట్ అయింది.
శ్రీకాకుళం యాస భాషలో చిరంజీవి ట్రైలర్ లో మాట్లాడిన తీరు.బట్టి చూస్తే మంచి కామెడీ.
మాస్ ఎంటర్ టైనర్ గా “వాల్తేరు వీరయ్య” తెరకెక్కినట్లు అర్థమవుతుంది.







