ధమాకా డైరెక్టర్ కు భారీ ఆఫర్ ఇచ్చిన మెగాస్టార్.. సక్సెస్ అవుతాడా?

టాలీవుడ్ దర్శకుడు త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ధమాకా.ఇందులో టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన హీరోయిన్ గా శ్రీ లీల నటించిన విషయం తెలిసిందే.

ఇటీవలే విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను అందుకోవడంతోపాటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.అయితే వరుస ఫ్లాప్ లతో ఉన్న రవితేజ ఈ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు.

అంతేకాకుండా రవితేజ కెరియర్ లో ఈ సినిమా అత్యధిక స్థాయిలో కలెక్షన్స్ ను రాబట్టింది.దీంతో ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ త్రినాథరావు పేరు మారుమూగిపోతోంది.

ఇదివరకే తెరకెక్కించిన సినిమాలు కూడా మంచి సక్సెస్ ను సాధించాయి.కానీ ఆ సినిమాలు డైరెక్టర్ కెరియర్ను మాత్రం పెంచలేకపోయాయి.కానీ ఇటీవల విడుదలైన ధమాకా సినిమా త్రినాథరావు రేంజ్ ని పెంచేయడంతో పాటుగా అతనితో స్టార్ హీరోలు సినిమాలు చేయాలని అడుగులు ముందుకు వేస్తున్నారు.

ఇది ఇలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి త్రినాథరావుకు ఒక భారీ ఆఫర్ ను ఇచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.మంచి కథ ఉంటే రెడీ చేసుకోవాలని ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Advertisement

ఇక మెగాస్టార్ చెప్పిన కొత్తగా డైరెక్టర్ త్రినాథరావు ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసుకుని మెగాస్టార్ దగ్గరికి వెళ్లి ఒప్పిస్తే వెంటనే ఆ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుంది అని చెప్పవచ్చు.

అయితే గతంలో త్రినాథరావు ఒక ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ తో సినిమా చేయాలని ఉంది అని తెలిపిన విషయం తెలిసిందే.ఇప్పుడు చిరంజీవితో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఒకవేళ చిరంజీవితో రూపొందుతున్న సినిమా సక్సెస్ అందుకుంటే త్రినాధరావు క్రేజ్ మరో రేంజ్ లో ఉంటుంది అని చెప్పవచ్చు.

అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవితో, త్రినాథరావు రూపొందించనున్న సినిమా డివివి దానయ్య నిర్మించే అవకాశాలు ఉన్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి.ధమాకా సినిమాతో భారీగా క్రేజ్ నీ ఏర్పరచుకున్న త్రినాధరావు తదుపరి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు