సైరా : ఒక కంట పన్నీరు మరో కంట కన్నీరు

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి కలెక్షన్స్‌ వింతైన పరిస్థితితో ఉన్నాయి.

ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక స్క్రీన్‌లలో విడుదల అయ్యింది.

పలు భాషల్లో కూడా ఈ చిత్రంను డబ్‌ చేశారు.ముఖ్యంగా హిందీ వర్షన్‌ ఏకంగా 100 కోట్లు వసూళ్లు చేస్తుందని అంతా భావించారు.

అక్కడ రివ్యూవర్స్‌ పాజిటివ్‌ టాక్‌ ఇవ్వడంతో మంచి వసూళ్లు నమోదు అవుతాయని భావించిన మేకర్స్‌కు ఊహించని పరిణామం ఎదురైంది.హిందీలో ఈ చిత్రం బయ్యర్ల కొంప ముంచింది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం హిందీ రైట్స్‌ను ఒక ప్రముఖ సంస్థ దాదాపుగా 30 కోట్ల రూపాయలను వ్యచ్చించి కొనుగోలు చేయడం జరిగింది.అయితే కలెక్షన్స్‌ విషయంలో పరిస్థితి దారుణంగా ఉంది.

Advertisement

కనీసం 10 కోట్లు కూడా రాబట్టే పరిస్థితి కనిపించడం లేదు.ఇక తమిళనాడు, కర్ణాటకలో కూడా పరిస్థితి అలాగే ఉంది.

అక్కడ బయ్యర్లు నిండి మునిగి పోతున్నారు.ఓవర్సీస్‌లో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉందని ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు.

  తెలుగు రాష్ట్రాల్లో వంద కోట్ల షేర్‌కు దగ్గరకు వచ్చింది.అతి త్వరలోనే బ్రేక్‌ ఈవెన్‌ను సాధించడం ఖాయం అంటున్నారు.కాని ఇతర ప్రాంతాల్లో మాత్రం బ్రేక్‌ ఈవెన్‌ సంగతేమో కాని కనీసం పెట్టుబడిలో 20 శాతం వచ్చిన పరిస్థితి లేదు.

దాంతో బయ్యర్లు నిర్మాత రామ్‌ చరణ్‌పై పడుతున్నట్లుగా సమాచారం అందుతోంది.తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు సాధిస్తున్నందుకు సంతోషంగా ఉన్న మేకర్స్‌ మరో వైపు సినిమా ఇతర ప్రాంతాల్లో దారుణమైన పరాజయం పాలవ్వడంతో బాధ పడుతున్నారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
జూనియర్ ఎన్టీఆర్ పేరు బాలయ్యకు నచ్చదా.. తన తండ్రి పేరు దక్కడం బాలయ్యకు ఇష్టం లేదా?

ఇలాంటి పరిస్థితులు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి.

Advertisement

తాజా వార్తలు