'మెగా ' వార్ : అల్లు అర్జున్ 'మెగా' ఫ్యామిలీ కాదా ?

మొన్నటి వరకు మెగా ఫ్యామిలీ కి సంబంధించి అంతా ఏకతాటిపై ఉన్నారు.అసలు మెగా ఫ్యామిలీ లో విభేదాలు లేనట్టుగా ఉండేవి.

 Chiranjeevi Pawan Kalyan Fans Clash With Allu Arjun Fans Mega Heros, Mega Family, Janasena, Pavan Kalyan, Allu Arjun, Allu Arvind, Nagababu, Konidela, Ramcharan, Vijayawada Mega Fans Meeting,-TeluguStop.com

  ఎప్పుడైతే జనసేన పార్టీ కోసం.పవన్ కళ్యాణ్ ను సీఎం చేయాలని ఏకైక లక్ష్యంతో ‘మెగా ‘ ఫ్యామిలీ హీరోల ఫ్యాన్స్ అంతా ఏకతాటిపైకి వచ్చి విజయవాడలో కీలక సమావేశం నిర్వహించారు.

ఆ సమావేశం తర్వాత నుంచి ఈ అనుమానాలు మొదలయ్యాయి.ముఖ్యంగా అల్లు అర్జున్ ను పక్కన పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని,  ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతుండటం,  మెగాఫ్యామిలీ పైన విమర్శలు చేస్తూ ఉండటం వంటి వ్యవహారాలతో కొద్దిరోజులుగా ఈ వ్యవహారాలు హాట్ టాపిక్ గా మారాయి.

 Chiranjeevi Pawan Kalyan Fans Clash With Allu Arjun Fans Mega Heros, Mega Family, Janasena, Pavan Kalyan, Allu Arjun, Allu Arvind, Nagababu, Konidela, Ramcharan, Vijayawada Mega Fans Meeting, -మెగా వార్ : అల్లు అర్జున్ మెగా#8217; ఫ్యామిలీ కాదా -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

        ఆలిండయా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రవణం స్వామినాయుడు ఆధ్వర్యంలో విజయవాడలో మెగా ఫ్యాన్స్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదం కు కారణమైంది.

ఈ ఫ్లెక్సీలో పవన్ కళ్యాణ్ ,చిరంజీవి,  రామ్ చరణ్ , నాగబాబు ఫోటోలు మాత్రమే ఏర్పాటు చేయడంతో,  అల్లు అర్జున్ ఫోటో ను ఎందుకు పెట్టలేదు అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు.ఉద్దేశపూర్వకంగానే మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ ను దూరం పెడుతోంది అంటూ పోస్టింగ్స్ పెడుతుండటం వైరల్ గా మారింది.   

    అంతేకాకుండా విజయవాడలో జరిగిన సమావేశంలో మెగా ఫ్యామిలీ తప్ప వేరే వారు మనకు అవసరం లేదని,  అలాంటి వారిని లెక్కలకి కూడా తీసుకోవాల్సిన అవసరం లేదంటూ మెగా ఫ్యాన్స్ ఆ సమావేశంలో పేర్కొనడం ఈ వివాదానికి ప్రధాన కారణం అయింది.దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏం పీకలేరు బ్రదర్అనే యాష్ తో మెగాఫ్యామిలీపై విమర్శలు చేస్తున్నారు.సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ ఫాన్స్ వివాదం ముదిరింది.అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు చిరంజీవి,  రామ్ చరణ్ , పవన్ కళ్యాణ్ అభిమానులు కౌంటర్ లు ఇస్తున్నారు.

అసలు మెగాస్టార్ చిరంజీవి లేకపోతే అసలు మీరందరూ ఎక్కడ ఉండేవారు అంటూ కౌంటర్ ఇస్తుండగా,  అల్లు అర్జున్ తాత అల్లు రామలింగయ్య లేకపోతే చిరంజీవి ఎక్కడ ఉండేవాడు అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ విమర్శలు చేస్తున్నారు.మెగా ఫ్యామిలీ హీరోల అందర్నీ ఏకతాటిపైకి తెచ్చి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన విజయవాడ సమావేశం కాస్త ఇప్పుడు ఈ  వివాదానికి ఆజ్యం పోసినట్లయింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube