పేకప్ చెప్పినా చిరంజీవి గారు లొకేషన్ నుంచి వెళ్లే వారు కాదు... కారణం అదే: కొరటాల

టాలీవుడ్ ఇండస్ట్రీలో రచయితగా మంచి గుర్తింపు సంపాదించుకున్న కొరటాల మిర్చి సినిమాతో దర్శకుడిగా మారారు.ఇలా దర్శకుడిగా తన దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకుంది.

 Chiranjeevi Not Leave The Locatio When Wesaid Pickup Because Of That By Koratala-TeluguStop.com

ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల దర్శకత్వంలో ఆచార్య సినిమా తెరకెక్కింది.ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈనెల 29వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కొరటాల చిరంజీవి గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేని కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చి స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదుగుతూ ఇండస్ట్రీలో ఓ గొప్ప స్థానంలో ఉన్నారు.ఈయనకు నటన అంటే ఎంతో గౌరవం, ఇష్టం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Telugu Acharya, Chiranjeevi, Kajal Agrawal, Koratala Shiva, Pooja Hegdhe, Ram Ch

ఈ క్రమంలోనే కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.చిరంజీవి గారికి షూటింగ్ లోకేషన్ లో ఉండటం చాలా ఇష్టం.ఇక ఆయన సీనియర్ కనుక చిరంజీవి గారికి 4:30కి ప్యాకప్ చెప్పేస్తాను.మిగతా ఆర్టిస్టులకు సాయంత్రం 6:30 కి ప్యాకప్ చెప్పేస్తాను.కానీ చిరంజీవి గారికి పేకప్ చెప్పిన ఆయన షూటింగ్ లోకేషన్ నుంచి ఇంటికి వెళ్ళేవారు కాదు.అక్కడే టీ తాగుతూ లొకేషన్ లో అందరితో సరదాగా గడిపేవారు.

ఎందుకంటే ఆయనకు నటన పై ఉన్న గౌరవం,లైట్స్ ,సౌండ్, యాక్షన్, కట్ అనేవి ఆయనకి ఎంతో ఇష్టం.అందుకే ముందుగా అతనికి పేకప్ చెప్పినా అందరు వెళ్లే వరకు ఆయన షూటింగ్ లొకేషన్లోనే ఉంటారని కొరటాల మెగాస్టార్ గురించి తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube