జక్కన్న రికార్డును బ్రేక్ చేసే దర్శకుడు ఉన్నాడా.. ఆయనకు మాత్రమే సొంతమంటూ?

స్టార్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన బాహుబలి2, ఆర్ఆర్ఆర్ సినిమాలు భారీ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.బాహుబలి2 సినిమా 1810 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోగా ఆర్ఆర్ఆర్ సినిమా 1100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.ఇలా వరుసగా రెండు సినిమాలతో జక్కన్న ఖాతాలో అరుదైన రికార్డ్ చేరింది.ఈ రికార్డ్ ఇప్పట్లో బ్రేక్ కావడం కష్టమేనని చెప్పవచ్చు.

 Which Director Will Break Rajamouli Records Details, Rajamouli, Rajamouli Range,-TeluguStop.com

ఏ డైరెక్టర్ అయినా వరుసగా మూడు సినిమాలతో 1,000 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంటే మాత్రమే ఈ రికార్డ్ బ్రేక్ అవుతుంది.అయితే జక్కన్న రికార్డును బ్రేక్ చేసే దర్శకుడు ఉన్నాడా? అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.జక్కన్నకు కూడా భాషతో సంబంధం లేకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.జక్కన్న ఖాతాలో ఆయనకు మాత్రమే సొంతమైన అరుదైన రికార్డులు ఉన్నాయి.

దేశంలోని నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి అని చాలామంది నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Bahubali, Eega, Pan India, Prabhas, Rajamouli, Rajamouli Range, Ram Chara

బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల విషయంలో కొన్ని విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో తర్వాత సినిమాల విషయంలో ఆ విమర్శలు వ్యక్తం కాకుండా రాజమౌళి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.రాజమౌళి రెమ్యునరేషన్ సైతం సినిమాసినిమాకు ఊహించని స్థాయిలో పెరుగుతున్న సంగతి తెలిసిందే.

Telugu Bahubali, Eega, Pan India, Prabhas, Rajamouli, Rajamouli Range, Ram Chara

ఈగ సినిమా వరకు పరిమితంగా రెమ్యునరేషన్ తీసుకున్న రాజమౌళి బాహుబలి సినిమా నుంచి రెమ్యునరేషన్ ను పెంచేశారు.రాజమౌళి స్థాయిలో రెమ్యునరేషన్ ను అందుకుంటున్న మరో డైరెక్టర్ లేరనే చెప్పాలి.రాజమౌళి సినిమా కోసం తీవ్రంగా శ్రమించడం వల్లే ఆయన సినిమాలు పాజిటివ్ ఫలితాలను అందుకుంటున్నాయి.

జక్కన్న కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.జక్కన్న భవిష్యత్తులో మరెన్నో సక్సెస్ లను సొంతం చేసుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube