చిరు మీసం అందుకే తీసేశాడట!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే.ఈ లాక్‌డౌన్ సమయంలో చిరు ఇంటికే పరిమితమయ్యాడు.

కాగా తాజాగా చిరు సరికొత్త లుక్‌లో కనిపించడంతో ఆయన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అయితే ఈ లుక్ ఆచార్య సినిమా కోసం అయి ఉంటుందని అందరూ అనుకున్నారు.

కానీ ఈ లుక్ గురించిన అసలు విషయాన్ని చిరు రివీల్ చేశాడు.ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితం కావడంతో సరదాగా ఇలా సరికొత్త లుక్‌లో కనిపించాడట చిరు.

Advertisement

అయితే ఇదేమీ సినిమా లుక్ కాదని ఆయన క్లారిటీ ఇచ్చాడు.దీంతో చిరు సరికొత్త లుక్ గురించి వస్తున్న వార్తలకు చెక్ పడిందని చెప్పాలి.

మీసం, గడ్డం తీసేసిన చిరు చాలా యంగ్‌గా కనిపిస్తుండటంతో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.ఈ లుక్‌తో చిరు సినిమాలో కనిపిస్తే ఆ కిక్కే వేరు ఉంటుందని మెగా అభిమానులు కోరుతున్నారు.

ఇక ఆచార్య సినిమాలో చిరు సరసన హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ నటిస్తోండగా, మెగా పవర్ స్టా్ర్ రామ్ చరణ్ కేమియో పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్‌ను కరోనా వైరస్ ప్రభావం తగ్గిన తరువాత తిరిగి ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

వీడియో వైరల్ : మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని నీటిలో వేలాడదీసిన గ్రామ ప్రజలు.. చివరకు..?!
Advertisement

తాజా వార్తలు