చిరు మిస్ అయ్యాడు.. వెంకీ బ్లాక్ బస్టర్ కొట్టాడు.. ఈ సినిమా వెనుక పెద్ద కథ ఉందట..

ఈ సినీ ప్రపంచంలో ఎన్నో వింతలు మరెన్నో విశేషాలు జరుగుతాయి.అయి ఒకానొక సందర్భంలో బయట పడితే అందరు షాక్ అవ్వడం ఖాయం.

ప్రతీ సినిమా పట్టాలెక్కాలంటే దాని వెనుక చాలా ఆలోచనలు, ఆచరణలు ఉంటాయి.ఇంత పెద్ద కథ జరిగితే కానీ ఒక సినిమా పట్టాలెక్కదు.

ఇలా ఒక్కోసారి ఒక హీరోతో అనుకున్న సినిమా మరో హీరో చేస్తూ ఉంటాడు.ఇలాంటి సందర్భాలు చాలానే జరుగుతూ ఉంటాయి.

ఇలా జరిగితే దర్శక నిర్మాతలకు, హీరోలకు మధ్య గ్యాప్ వస్తుంది.టాలీవుడ్ లో నిర్మాతగా, ఎగ్జిగ్యూటర్ గా డిస్టిబ్యూటర్ గా రాణిస్తున్న కేవీబీ సత్యనారాయణ విక్టరీ వెంకటేష్ తో ఒకే ఏడాదికి రెండు సినిమాలు నిర్మించారు.

Advertisement
Chiranjeevi Missed Venkatesh Hit The Blockbuster, Chiranjeevi, Venkatesh, Konda

అవి కొండపల్లి రాజా ఒకటి.సుందరకాండ ఒకటి.

ఈ రెండు సినిమాలలో కొండపల్లి రాజాకు రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించారు.అలాగే సుందరకాండ సినిమాకు రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు.

కేవీబీ సత్యనారాయణ రజనీకాంత్ నటించిన అన్నామలై సినిమా రైట్స్ తీసుకుని హైదరాబాద్ వస్తున్న క్రమంలోనే ఫ్లైట్ లో చిరు కలవడంతో ఆయనకు కథ వినిపించగా చిరు ఓకే చెప్పారట.అయితే ఆ ఆనందంలో కేవీబీ సత్యనారాయణ సుందరకాండ సెట్స్ కు వచ్చి అక్కడి వారికీ విషయం చెప్పగా ఆ సినిమా కూడా మనమే చేద్దామని వెంకీ అన్నారట.

దీంతో ఈయనకు ఏం చేయాలో అర్ధం కాలేదట.చిరును వదులుకున్నందుకు బాధపడాలో.

ఆ ఈవెంట్ లో అవమానం.. నితిన్ సారీ చెప్తాడని వెళ్తే అలా జరిగింది.. హర్షవర్ధన్ కామెంట్స్ వైరల్!
మైత్రీ నిర్మాతలపై ఊహించని స్థాయిలో భారం.. అన్ని వందల కోట్లు రాబట్టాలా?

లేదంటే వెంకీ మరో సినిమా ఓకే చేసాడని ఆనంద పడాలో తెలియని స్థితిలోకి వెళ్లారట.

Chiranjeevi Missed Venkatesh Hit The Blockbuster, Chiranjeevi, Venkatesh, Konda
Advertisement

ఈ విషయాన్నీ చిరు కి చెప్పి వెంకీ తోనే కొండపల్లి రాజా తీశారు.ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.అయితే ఇక్కడ మరో విషయం కూడా జరిగింది.

ఈ సినిమా 1987లో హిందీలో ఉదాగస్ అనే నవల ఆధారంగా తీశారు.ఈ సినిమా రీమేక్ రైట్స్ కృష్ణం రాజు తెలుగులో ప్రాణస్నేహితులు సినిమా బేస్ చేసుకుని రజనీ తమిళ్ లో చేసారు.

మళ్ళీ అదే సినిమా అటు తిరిగి ఇటు తిరిగి కొండపల్లి రాజా గా తెలుగులో రావడంతో కృష్ణం రాజు కేసు వేశారు.చివరకు పెద్దలు జోక్యం చేసుకుని రాజీ కుదర్చగా ఈ విషయం అప్పట్లో సంచలనం సృష్టించింది.

తాజా వార్తలు