మనవరాలు జాతకం అద్భుతం... చిరంజీవి కామెంట్స్ వైరల్!

మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) మరోసారి తాత అయ్యారు.

రాంచరణ్( Ramcharan ) ఉపాసన ( Upasana ) దంపతులకు కుమార్తె జన్మించడంతో చిరంజీవి సంతోషంలో ఉన్నారు.

పెళ్లయిన 10 సంవత్సరాలకు తన కొడుకు కోడలు తల్లిదండ్రులు కాబోతున్నారన్న వార్త ముందుగా చిరంజీవి అభిమానులతో పంచుకున్నారు.అయితే తమ ఇంటికి ఎప్పుడెప్పుడు వారసుడు లేదా వారసురాలు వస్తారా అని ఎదురుచూస్తున్నటువంటి ఆరోజు రానే వచ్చింది.

మంగళవారం తెల్లవారుజామున ఉపాసన ఆడబిడ్డకు ( Baby Girl ) జన్మనిచ్చారు.ఇక ఈ విషయాన్ని అపోలో హాస్పిటల్ వైద్యులు వెల్లడించారు.

ఇక ఉపాసన బిడ్డకు జన్మనిచ్చారనే విషయం తెలియడంతో వెంటనే చిరంజీవి అపోలో హాస్పిటల్ కి వెళ్లి తన మనవరాలిని చూసి ఎంతో సంబరపడిపోయారు.ఇలా తన మనవరాలిని చూసిన అనంతరం చిరంజీవి మీడియా సమావేశంలో పాల్గొన్నారు.ఈ క్రమంలోనే ఈయన తన మనవరాలు గురించి ఎంతో గొప్పగా చెప్పారు.

Advertisement

మాకెంతో ఇష్టమైనటువంటి మంగళవారం రోజున మా మనవరాలు జన్మించిందని సంతోషం వ్యక్తం చేశారు.

మంగళవారం ఉదయం 1:49 గంటలకు పాప పుట్టింది.చాలా మంచి గడియలలో జన్మించిందని తన జాతకం ఎంతో అద్భుతంగా ఉందని చిరంజీవి తెలియచేశారు.అయితే పాప జాతకం ముందు నుంచి మా ఇంటి పై ప్రభావం చూపుతోందని చిరంజీవి తెలిపారు.

రామ్ చరణ్ ఇండస్ట్రీలో ఎదుగుదల మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం అలాగే వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ ( varun Tej Engagment )జరగడం ఇలా మా ఫ్యామిలీలో అన్ని శుభాలే జరుగుతున్నాయని, పాప జాతక ప్రభావం మా ఇంటి పై పడిందంటూ ఈ సందర్భంగా చిరంజీవి తన మనవరాలి జాతకం అద్భుతంగా ఉందంటూ మురిసిపోతూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

మోహన్ బాబు ఫ్యామిలీ లో గొడవలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవా..?
Advertisement

తాజా వార్తలు