వివాదంలో చిరంజీవి.. మాల ధరించిన కొడుకు పక్కన చెప్పులు వేసుకొని అలా?

అప్పుడప్పుడు కొందరు కొన్ని విషయాలలో పొరపాట్లు తెలిసి చేస్తారో తెలియక చేస్తారో తెలియదు కానీ.దానివల్ల వివాదాలో ఇరికిపోతుంటారు.

ఒక హోదాలో ఉన్న వాళ్ళు కూడా పొరపాట్లు చేస్తూ ఉంటారు.అయితే తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక పొరపాటు చేశాడు.

అది నిజంగా తెలిసి చేశాడో తెలియక చేశాడో తెలియదు కానీ మొత్తానికి వివాదంలో ఇరికాడు.ఇంతకు అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.

టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి నటుడుగా మంచి పేరు సంపాదించుకున్నాడు.మూడు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతూ తెలుగు రాష్ట్రాల ప్రజలతో మంచి అభిమానం పెంచుకున్నాడు.

Advertisement

ఇప్పటికీ యంగ్ హీరోలతో పోటీగా దూసుకెళ్తున్నాడు.ఇక వ్యక్తిగతంగా కూడా ఈయన మంచి పేరు సంపాదించుకున్నాడు.

గతంలో రాజకీయపరంగా బాధ్యతలు చేపట్టిన కూడా ఆయనకు అంతగా కలిసి రాలేదు.

ఇక రాజకీయంగా దూరంగా కేవలం నటనకే ప్రాధాన్యత ఇస్తున్నాడు.ప్రజలకు తన తోచిన సహాయం చేస్తూ ఉంటాడు.ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటాడు.

ఏం జరిగినా వెంటనే స్పందిస్తూ ఉంటాడు.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈయన ఒక వివాదంలో ఇరికాడు.

కమల్ హాసన్ భారతీయుడు 3 తో మరోసారి నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడా..?
కీర్తి సురేష్ పెళ్లి చీర కోసం అన్ని గంటలు కష్టపడ్డారా.. ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?

అది కూడా తన కొడుకు విషయంలోనే.తన కొడుకు రామ్ చరణ్ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి అతి తక్కువ సమయంలో స్టార్ హోదాకు చేరుకున్నాడు.

Advertisement

నటనతో మంచి మార్కులు సంపాదించుకునే ఈయన తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకున్నాడు.ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతున్నాడు.

కేవలం తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా ఇతర భాషకు చెందిన వాళ్లు కూడా ఈయనకు అభిమానులుగా మారారు.

రామ్ చరణ్ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు.తన సినిమా అప్డేట్లను, ఫ్యామిలీ విషయాలను బాగా పంచుకుంటూ ఉంటాడు.ఇదంతా పక్కన పెడితే రామ్ చరణ్ ప్రస్తుతం అయ్యప్ప మాల ధరించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఆయన దీక్షలో ఉన్నాడు.ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు దీక్షలో ఉన్నాడు.

అయితే నిన్న మహాశివరాత్రి సందర్భంగా తన కుటుంబ సభ్యులతో పాటు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు చెబుతూ ఒక ఫోటో పంచుకున్నాడు.

అందులో తన తల్లి తండ్రి మధ్యలో కూర్చున్నాడు.అంతేకాకుండా నిన్న తన తల్లి సురేఖ పుట్టినరోజు కూడా.ఆమెకు కూడా శుభాకాంక్షలు తెలిపాడు.

అయితే తన తల్లిదండ్రులు ఇద్దరు.సోఫాలో కూర్చోగా  రామ్ చరణ్ మాత్రం కింద వాళ్ల కాళ్ల దగ్గర కూర్చున్నాడు.

అంతేకాకుండా ఆ సమయంలో చిరంజీవి చెప్పులు వేసుకుని కనిపించగా.ఆ చెప్పులు రామ్ చరణ్ కు కాస్త తగిలినట్లు కూడా అనిపించింది.

దీంతో ఆ ఫోటో చూసిన వాళ్లంతా చిరంజీవి పై బాగా ఫైర్ అవుతున్నారు.రామ్ చరణ్ అయ్యప్ప మాల దీక్షలో ఉన్నాడు.

అటువంటిది మీరు ఆయనను కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకొని.చెప్పులు తగిలేలా ఎలా కూర్చున్నారు అంటూ ఫైర్ అవుతున్నారు.

మరీ ఈ విషయం గురించి చిరంజీవి ఏమని స్పందిస్తాడో  చూడాలి.

తాజా వార్తలు