ఐతే గాడ్‌ ఫాదర్‌ కి బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ అంటూ ఏమీ లేదా?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమా కు దర్శకత్వం వహించాడు.

 Chiranjeevi Godfather Movie Producer N V Prasad Comments ,chiranjeevi,godfather,-TeluguStop.com

రామ్ చరణ్ మరియు ఎన్.వి ప్రసాద్ లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించడం జరిగింది.ఈ సినిమా కు 100 కోట్ల రూపాయల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అంటూ విడుదలకు ముందు మీడియా లో తెగ హడావుడి జరిగింది.ఇటీవల సినిమా విడుదల అయింది.

దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన గాడ్ ఫాదర్ సినిమా 100 కోట్ల కలెక్షన్స్ నమోదు చేసినట్లుగా ఇప్పటికే వార్తలు వస్తున్నాయి.అయినా కూడా ఫ్రీ రిలీజ్ బిజినెస్ కాస్త ఎక్కువ చేయడం తో బ్రేక్ ఈవెన్ సాధ్యం కాక పోవచ్చు అంటూ చాలా మంది కామెంట్ చేస్తున్నారు.

Telugu Chiranjeevi, Godfather, Mohan Raja, Prasad, Nv Prasad, Telugu-Movie

ఆ విషయమై నిర్మాత ఎన్ వి ప్రసాద్ తాజాగా మాట్లాడుతూ అసలు మేము సినిమా ను ఏ ఒక్కరికి అమ్మలేదు.మా సినిమా ను మేమే సొంతం గా విడుదల చేశాము.కనుక బ్రేక్ ఈవెన్‌ టార్గెట్ అనేది లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు.అంతా ఇంతా టార్గెట్ అంతా అంటూ మీడియాలో వస్తున్న వార్తలన్నీ కూడా అవాస్తవం అంటూ ఆయన క్లారిటీ ఇవ్వడం తో అతి త్వరలోనే సినిమా నిర్మాతలు లాభాల్లో పడే అవకాశం ఉందని సమాచారం అందుతుంది.

సినిమా కు మొదటి వారం దాదాపు గా 150 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదయ్యే అవకాశం ఉందని చిత్ర యూనిట్ సభ్యులు చాలా నమ్మకం గా చెప్పారు.అది నిజం అవ్వబోతుందని తాజాగా నిర్మాత మాటలను బట్టి అర్థమవుతుంది.

మెగాస్టార్ చిరంజీవి కి చాలా కాలం తర్వాత ఒక మంచి సాలిడ్ హిట్ లభించింది.ఆచార్య చిత్రం ఫ్లాప్ నుండి ఆయన బయటపడ్డట్లే అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube