మహేష్ బాబుని చూసి గుండె తరుక్కుపోయింది.. ఎప్పుడూ అలా చూడలేదు: పరుచూరి

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఇందిరా దేవి కన్నుమూసిన విషయం తెలిసిందే.ఈమె అనారోగ్య సమస్యలతో మరణించడంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఎంతోమంది సినీ ప్రముఖులు ఈమె సంస్కరణ సభలో పాల్గొని నివాళులు అర్పించారు.

 Mahesh Babus Heart Sank Never Seen It Like That Paruchuri, Mahesh Babu', Heart S-TeluguStop.com

ఈ క్రమంలోనే సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ కూడా ఇందిరా దేవికి నివాళులు అర్పించారు.అనంతరం ఈయన మాట్లాడుతూ కృష్ణ కుటుంబంతో తనకు ఉన్న అనుబంధం గురించి తెలియజేశారు.

ఇలాంటి సమయంలోనే కృష్ణ కుటుంబ సభ్యులు ఎంతో ధైర్యంగా ఉండాలని కోరుకున్నారు.

ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ ఘట్టమనేని కుటుంబంతో తమకు ఎన్నో ఏళ్ల నుంచి మంచి అనుబంధం ఉందని తెలిపారు.

ఇక ఇందిరమ్మ గురించి మాట్లాడుతూ ఆమె సాక్షాత్తు మహాలక్ష్మి ఎప్పుడు ఎక్కువగా మాట్లాడరు.ఎవరినైనా చిరునవ్వుతోనే పలకరిస్తారని గోపాలకృష్ణ వెల్లడించారు.ఇక ఈమె మరణం ఎంతగానో బాధ కలిగించిందని గోపాలకృష్ణ తెలిపారు.ఇక ఈమె సంస్కరణ సభలో కృష్ణ గారిని కలిసి పరామర్శించాను ఆయన గుండె నిబ్బరం చేసుకుని కూర్చున్నారు అంటూ పరుచూరి తెలిపారు.

Telugu Heart Sank, Indira Devi, Krishnas, Mahesh Babu, Paruchuri-Movie

ఇక ఎప్పుడు చిరునవ్వుతో కనిపించే మహేష్ బాబుని చూడగానే గుండె తరుక్కుపోయింది. ఆయనని ఎప్పుడూ అలా చూడలేదు.మహేష్ బాబుని అంత దిగాలుగా చూస్తానని తాను ఎప్పుడు అనుకోలేదని ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇకపోతే ఇందిరాదేవి అనారోగ్య సమస్యలతో గత నెల 28వ తేదీ కన్నుమూసిన విషయం మనకు తెలిసిందే.

ఇక తన తల్లి మరణం తర్వాత మహేష్ బాబు సినిమా షూటింగుకు కాస్త విరామం ఇచ్చి తన తల్లి కార్యక్రమాలన్నింటిని పూర్తి చేస్తున్నారు.అయితే మహేష్ బాబు త్వరలోనే సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube