Chiranjeevi Hari Prasad: ఒక స్టార్ హీరోయిన్ వళ్ళ సర్వం కోల్పోయిన చిరంజీవి స్నేహితుడు

చిరంజీవి కెరీర్ మొదలు పెట్టిన తొలినాళ్లలో మద్రాసులో తనతో పాటే గదిలో కొంత మంది రూమ్ మేట్స్ ఉండేవారు.వారంతా కూడా సినిమా ఇండస్ట్రీ కి చెందినవారే.

 Chiranjeevi Friend Hari Prasad Tragedy Ending Details, Chiranjeevi , Hari Prasad-TeluguStop.com

కమెడియన్ సుధాకర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ హరి ప్రసాద్ మరొక నటుడు నారాయణ రావు తో కలిసి టి నగర్ లో ఉండేవారు.ఇక మెగాస్టార్ చిరంజీవి డైనమిక్ హీరో గా కెరీర్ లో దూసుకుపోతున్నప్పుడు తన ఫ్రెండ్స్ అంత కలిసి డైనమిక్ మూవీస్ అనే ఒక బ్యానర్ స్థాపించి యముడికి మొగుడు అనే సినిమా తీసిన విషయం తెలిసిందే.

ఈ సినిమా విజయం తర్వాత అంత లాభాలు పంచుకొని ఎవరి పని లో వారు బిజీ అయ్యారు.మళ్లి ఆ బ్యానర్ పై ఏ సినిమా కూడా తీయలేదు.

ఆ తర్వాత సుధాకర్ తో పాటు నారాయణ రావు సినిమాల్లో బాగానే సెటిల్ అయినా కూడా హరి ప్రసాద్ మాత్రం హీరో గా చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి.దాంతో చిన్న వయసులోనే తండ్రి పాత్రల్లో కూడా నటించాడు.

సినిమాల్లో కొంత సంపాదించి కన్నడ సినిమా లో నిర్మాత గా కొన్ని సినిమాలు తీసాడు.అయితే ఒక హీరోయిన్ తో ఒక సినిమా తీస్తూ పూర్తిగా కెరీర్ పోగొట్టుకున్నాడు హరి ప్రసాద్.

అలనాటి స్టార్ హీరోయిన్ మాధవి తో హీరోయిన్ గా ఒక సినిమా నిర్మాణం చేపట్టాడు.కానీ సినిమా మొదలైన కొన్ని రోజులకు ఆమె నిర్మాతకు, దర్శకుడికి చెప్పకుండా పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళిపోయింది.

Telugu Hariprasad, Chiranjeevi, Sudhakar, Hari Prasad, Madhavi, Yana Rao, Tollyw

దాంతో సినిమా మధ్యలోనే ఆగిపోయింది.సంపాదించుకున్న మొత్తం ఆ సినిమా కోసం అప్పటికే ఖర్చు పెట్టడం తో అయన జీవితం తలకిందులు అయ్యింది.కొన్ని రోజులు ఎంత ప్రయత్నించినా ఆమె ఇండియా కు రాలేదు.దాంతో అప్పు ఇచ్చిన వారి ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టారు.చివరికి కొన్ని రోజులకు వచ్చి మాధవి అతి కష్టం మీద డేట్స్ ఇచ్చి ఇండియా వచ్చి సినిమా చేసిన అది పరాజయం పాలయ్యింది.దాంతో పూర్తిగా హరి ప్రసాద్ రోడ్డున పడ్డాడు.

ఆ తర్వాత మెల్లిగా హైదరాబాద్ కి చేరుకొని టీవీ సీరియల్స్ లో కూడా చేసాడు.ఆ తర్వాత చిరంజీవి ప్రజారాజ్యం లో చేరి టీవీ 9 కి ఇంటర్వ్యూ ఇచ్చేందుకు వెళ్లి స్టూడియో లోనే కన్ను మూసాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube