వైఎస్సార్‌టీపీ అధ్యక్షరాలు వైఎస్ షర్మిలనీ ఎస్సార్ నగర్ పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే.నిన్న పాదయాత్రలో టిఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు కొంతమంది షర్మిళాకారుపై దాడికి పాల్పడటం జరిగిందట.
దీంతో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం పాదయాత్రలో చోటు చేసుకోవడంతో… షర్మిలనీ పోలీసులు హైదరాబాదుకి తరలించడం జరిగింది.అయితే మంగళవారం నాడు దాడికి గురైన కారుతో ప్రగతి భవన్ ముట్టడించడానికి షర్మిల బయలుదేరిన సమయంలో ఎస్ఆర్ నగర్ పోలీస్ లు… కారు లో ఉన్న షర్మిలాన్ని క్రేన్ సాయంతో పోలీస్ స్టేషన్ కి తరలించారు.
దీంతో షర్మిల అరెస్టు కావటం వల్ల వైసీపీ పార్టీకి చెందిన కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఇది దురదృష్టకరమని అన్నారు.దివంగత ముఖ్యమంత్రి కూతురు.పైగా సీఎం జగన్ సోదరి షర్మిలను కారులో ఉండగానే అరెస్టు చేయడం చాలా బాధాకరమని తెలిపారు.వ్యక్తిగతంగా షర్మిల అరెస్టు తనకి ఎంతగానో బాధించిందని.
దురదృష్టకరమైన ఘటన అని అన్నారు.

అయితే షర్మిల అరెస్టు పట్ల సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై.విజయమ్మ స్పందించారు.మీడియాతో విజయమ్మ మాట్లాడుతున్న సమయంలో… విలేకరులు షర్మిల అరెస్టు కరెక్ట్ కాదని సజ్జల కామెంట్లు చేశారు దీనిపై మీరేమంటారు అని ప్రశ్నించారు.
ఆయన చెప్పింది నిజమే కదా…, కరెక్ట్ కాదు కదా అని అన్నారు.ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా సమస్యల విషయంలో ఆందోళనలో నిరసనలు చేపట్టే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని విజయమ్మ తెలియజేశారు.







