మెగాస్టార్ చిరంజీవి బాలీవుడ్ సినిమా అయినా లాల్ సింగ్ చద్దా కు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్నాడు.
అలాగే కీలక పాత్రలో నాగ చైతన్య కూడా నటిస్తున్నాడు.ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ అని అనిపించడం కోసం కావాల్సిన అన్ని ప్రొమోషన్స్ చేస్తున్నాడు.
చిరు కూడా ప్రొమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్నాడు.ఈ క్రమంలోనే చిరంజీవి గాడ్ ఫాథర్ సినిమాలో సల్మాన్ ఖాన్ ను ఎందుకు ఎంపిక చేసుకున్నారు అనే వార్త తెరపైకి వచ్చింది.
ఆయన సినిమాలో అవకాశం నాకు కూడా కల్పించండి అంటూ అమీర్ ఖాన్ కూడా అడుగగా.అందుకు మెగాస్టార్ చెప్పిన సమాధానం ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది.
మెగాస్టార్ సల్మాన్ ఖాన్ నే ఎందుకు ఎంపిక చేసుకున్నారో చెప్పాలని అమీర్ ఖాన్ కోరగా.చిరు.
ఇది హృదయంతోనో లేదంటే మెదడుతోనే నటించే పాత్ర కాదు.శారీరకంగా బాగా చూపించాలి అని అందుకే సల్మాన్ ఖాన్ ను ఎంపిక చేసుకున్నారు అని చెప్పారట.

ఈ వార్తలను కొంతమంది వేరే రకంగా తీసుకున్నారు.అమీర్ చేసే సినిమాలు మాత్రమే హృదయం మెదడు ఉపయోగించేలా ఉంటాయని.మిగతా హీరోల సినిమాలు అలా ఉండవని అన్నారని మెగాస్టార్ పై విమర్శలు వచ్చాయి.కానీ చిరు మాత్రం వేరే రకంగా అన్నారని తెలుస్తుంది.చిరు అమీర్ ఖాన్ ఎమోషనల్ గా ఉండే కంటెంట్ ను ఎంపిక చేసుకుని సినిమాలు చేస్తే.సల్మాన్ ఖాన్ యాక్షన్ సినిమాలు ఎక్కువగా చేస్తాడు అనే ఉద్దేశంతో అన్నాడని ఇప్పుడు టాక్ బయటకు వచ్చింది.
మొత్తానికి అన్నది ఒకటి అయితే అనుకునేది మరొకటి.ఇక లాల్ సింగ్ చద్దా సినిమాకు చిరు ప్రొమోషన్స్ ఎంతవరకు ఉపయోగపడి ఈ సినిమా విజయంలో పాత్ర పోషిస్తాడో చూడాలి.