మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నటుడు రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఈయన కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా, RRR సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందారు.
ఈ సినిమా అనంతరం రామ్ చరణ్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.ఇకపోతే ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా రామ్ చరణ్ గురించి కొందరు హీరోయిన్లు చేస్తున్న కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
రామ్ చరణ్ తో తనకు డేటింగ్ వెళ్లాలని ఉంది అంటూగత కొద్దిరోజుల క్రితం బాలీవుడ్ హీరోయిన్స్ చేసిన కామెంట్స్ మనకు తెలిసిందే.
తాజాగా రవితేజ హీరోయిన్ రామ్ చరణ్ గురించి ఇలాంటి షాకింగ్ కామెంట్స్ చేశారు.రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో నటించిన అన్వేషీ జైన్ తన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రామ్‌చరణ్ గురించి కామెంట్స్ చేశారు.
తనకు రామ్ చరణ్ తో డేటింగ్ వెళ్లాలని ఉంది అంటూ కామెంట్ చేయడంతో ఒక్కసారిగా మీడియా అటెన్షన్ తన వైపు తిప్పుకున్నారు.

ఈ విధంగా ఈమె రామ్ చరణ్ గురించి చెప్పడంతో కొందరు నెటిజెన్లు స్పందిస్తూ.ఈమె నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు కానీ అప్పుడే స్టార్ హీరోలతో డేటింగ్ అంటూ బిస్కెట్లు వేయడం మొదలు పెట్టింది.ఇలా అయితే తనకు తెలుగులో అవకాశాలు వస్తాయని గట్టి ప్లాన్ చేసినట్టు ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇకపోతే రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా ఈనెల 29వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నటి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







