మరో సీనియర్ స్టార్‌ హీరో చేతిలోకి వెళ్లబోతున్న 'బ్రో డాడీ'

మలయాళ సూపర్ హిట్ మూవీ బ్రో డాడీ( bro daddy ) ని మెగాస్టార్‌ చిరంజీవి రీమేక్ చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.

ఇప్పటికే అందుకు సంబంధించిన చర్చలు జరిగాయి.

దర్శకుడిగా కళ్యాణ్‌ కృష్ణ పేరు ప్రధానంగా వినిపించింది.సిద్దు జొన్నలగడ్డ లేదా శర్వానంద్ లతో సంప్రదింపులు జరిగాయి అంటూ వార్తలు వచ్చాయి.

ఇక హీరోయిన్‌ గా త్రిష ను నటింపజేసే అవకాశాలు ఉన్నాయి అంటూ ప్రచారం జరిగింది.అంతే కాకుండా శ్రీ లీలను సిద్దు జొన్నలగడ్డకు లేదా శర్వానంద్ కు జోడీగా అనుకున్నారు.

కానీ ఇప్పుడు చిరంజీవి వశిష్ఠ దర్శకత్వం లో ఒక సోషియో ఫాంటసీ సినిమా ను చేసేందుకు ఓకే చెప్పాడు.మొన్న బర్త్‌ డే సందర్భంగా అధికారికంగా ప్రకటన వచ్చింది.

Advertisement

ఆ సినిమా ను అధికారికంగా ప్రకటించడం జరిగింది.

దాంతో బ్రో డాడీ పరిస్థితి ఏంటి అంటూ చాలా మంది మాట్లాడుకుంటున్నారు.ఈ సమయంలో ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం బ్రో డాడీ రీమేక్ రైట్స్ ను చిరంజీవి కూతురు సుస్మిత( Sushmita ) వదిలేశారట.అంతే కాకుండా మరో సీనియర్ హీరో తో సినిమా ను నిర్మించేందుకు ఒక నిర్మాత ముందుకు వచ్చారని కూడా ప్రచారం జరుగుతోంది.

మొత్తానికి చిరంజీవి బ్రో డాడీ సినిమా మొత్తానికి వదిలేశారు అంటూ ప్రచారం జరుగుతోంది.దాదాపుగా పాతిక లక్షల రూపాయలను స్కిప్ట్‌ వర్క్ కోసం వినియోగించారని తెలుస్తోంది.సుస్మిత ఆ మొత్తం డబ్బులు బూడితలో పోసిన పన్నీరు మాదిరిగానే వదిలేసిందని కూడా మీడియా సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

త్వరలోనే చిరంజీవి తో సుస్మిత కొత్త సినిమా ను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.వశిష్ఠ( Vashishtha ) దర్శకత్వంలో చిరంజీవి చేయబోతున్న సినిమా ను యూవీ క్రియేషన్స్ వారు నిర్మించబోతున్న విషయం తెల్సిందే.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?

చిరంజీవి రీమేక్ ల విషయం లో ప్రస్తుతం ఆక్తిగా లేడని టాక్ వినిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు