నిన్నటితో సంక్రాంతి పండుగ సెలవులు ముగిసిపోయాయి.అటు వాల్తేరు వీరయ్య, ఇటు వీరసింహారెడ్డి సినిమాలు సంక్రాంతి పండుగను బాగానే క్యాష్ చేసుకున్నాయి.
ఈ రెండు సినిమాలకు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి.టెన్షన్ పడుతూనే ఈ రెండు సినిమాలను విడుదల చేసిన మైత్రీ నిర్మాతలకు ఈ రెండు సినిమాలు భారీ లాభాలనే మిగిల్చాయని కామెంట్లు వ్యక్తమవుతుండటం గమనార్హం.
బడ్జెట్ బిజినెస్ లెక్కల ప్రకారం ఈ రెండు సినిమాలు సులువుగానే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది.
వీరసింహారెడ్డి సినిమా హక్కులను తక్కువ మొత్తానికి అమ్మడం ఈ సినిమా మేకర్స్ కు ప్లస్ అయింది.
వాల్తేరు వీరయ్య రొటీన్ మూవీనే అయినప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఉండటం ఈ సినిమాకు కలిసొచ్చింది.అయితే చిరంజీవికి ఎంటర్టైన్మెంట్ సినిమాలు బాగా సూట్ అవుతాయని బాలయ్యకు సీరియస్ సినిమాలు సూట్ అవుతాయని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

ఈ మధ్య కాలంలో చిరంజీవి సీరియస్ రోల్స్ లో నటించిన సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను నిరాశపరిచాయి.అయితే వాల్తేరు వీరయ్య మాత్రం మెగా ఫ్యాన్స్ కు నచ్చేలా ఉండటంతో ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించారు.అదే సమయంలో బాలయ్య సీరియస్ రోల్స్ లో నటించిన ప్రతి సందర్భంలో సక్సెస్ దక్కుతోంది.బాలయ్యలో మంచి కామెడీ టైమింగ్ ఉన్నా కామెడీ రోల్స్ లో బాలయ్య నటించిన సినిమాలు సక్సెస్ సాధించడం లేదు.

చిరంజీవి, బాలయ్య మరీ ప్రయోగాత్మక సినిమాలు చేసి రిస్క్ చేయడం కంటే అభిమానులను అలరించే సినిమాలలో నటిస్తే మంచిది.బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో నటిస్తుండగా చిరంజీవి తర్వాత సినిమా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.ఈ రెండు సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి.







