మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు.
అపజయం ఎరుగని కొరటాల శివ ఈ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం ఖాయం అంటున్నారు.భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమాకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
రికార్డు స్థాయి వసూళ్లు నమోదు చేస్తుంది అంటూ ఆచార్యపై మొదటి నుండే అంచనాలు ఉన్నాయి.కాని దురదృష్టం కొద్ది గత ఏడాది సైరా వల్ల ఆలస్యం అయ్యింది.
ఈ ఏడాది కరోనా వల్ల వాయిదా పడింది.ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది.
ఇటీవలే షూటింగ్ ప్రారంభించి అప్పుడే 80 శాతం షూటింగ్ ను ముగించేశాం అంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు.ప్రస్తుతం కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం ఇప్పటికే చిత్ర యూనిట్ సభ్యులు హైదరాబాద్ శివారు ప్రాంతంలో చిత్రీకరణలో పాల్గొంటున్నారు.
ఈ సినిమాను జనవరి లేదా ఫిబ్రవరి వరకు పూర్తి చేస్తారని తెలుస్తోంది.రామ్ చరణ్ కు సంబంధించిన సీన్స్ మాత్రమే బ్యాలన్స్ ఉంటాయని అంటున్నారు.ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి అవ్వడమే ఆలస్యం వెంటనే ఆచార్య షూటింగ్ లో చరణ్ పాల్గొంటాడు అంటున్నారు.ఈ సినిమా షూటింగ్ విషయంలో చిత్ర యూనిట్ సభ్యుల నుండి స్పందన రావాల్సి ఉంది.
మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాతో మరోసారి వంద కోట్ల క్లబ్ లో చేరతాడు అంటున్నారు.ప్రస్తుతం చిరంజీవితో కాజల్ షూటింగ్ లో పాల్గొంటుంది.
ఆచార్య సెట్ లో కాజల్ దంపతులను చిరంజీవి సన్మానించాడు.ఇక ఈ సినిమా కోసం ఐటెం సాంగ్ ను రెజీనా చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.
వచ్చే దసరా సీజన్ లో ఆచార్య వస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.