మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య’ ఫస్ట్‌లుక్ కోసం మెగా ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు.సినిమా టైటిల్‌ను కూడా ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు.
ఒక సందర్బంగా చిరంజీవి పొరపాటున నోరు జారి సినిమా టైటిల్ చెప్పేశాడు.ఇక చిరంజీవి లుక్ కూడా లీక్ అయ్యింది.
ఇప్పటి వరకు ఆచార్య నుండి ఎలాంటి అధికారిక పోస్టర్ కాని, ప్రకటన కాని రాలేదు.అన్ని అనుకున్నట్లుగా జరిగి ఉంటే షూటింగ్ పూర్తి అయ్యి ఆగస్టులో సినిమా వచ్చేది.
మాయదారి కరోనా వైరస్ కారణంగా ఆగస్టులో చిరంజీవి బర్త్‌డే సందర్బంగా సినిమా రావాల్సి ఉన్నా కూడా వాయిదా వేశారు.అయితే ఫ్యాన్స్‌ను నిరాశపర్చకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ఆగస్టులో ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడంతో పాటు టీజర్‌ను కూడా విడుదల చేస్తే ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ అవుతారు అనే ఉద్దేశ్యంతో మెగా కాంపౌండ్ ఆదిశగా పని చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

చిరంజీవి వయసు రీత్యా షూటింగ్‌కు వెళ్లడం సాధ్యం కాని పని.అందుకే ఆచార్య షూటింగ్ ఈ ఏడాదిలో మళ్లీ ప్రారంభం అయ్యేది లేనిది చెప్పలేని పరిస్థితి.అందుకే కనీసం ఫస్ట్‌లుక్‌ను అయిన విడుదల చేసి ప్రేక్షకులను అలరించాలనేది మెగా కాంపౌండ్ ప్రయత్నం.ఆగస్టులో ఆచార్యలో చరణ్ నటించే విషయంపై కూడా క్లారిటీ ఇవ్వనున్నారు.ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే.