టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు( Ganta Srinivasa Rao ) వ్యాఖ్యలపై మరో కీలక నేత కిమిడి నాగార్జున( Kimidi Nagarjuna ) స్పందించారు.చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని పార్టీ అధిష్టానం చెప్పిందని గంటా తెలిపారన్నారు.
అయితే చీపురుపల్లి నియోజకవర్గ టికెట్ తనకే వస్తుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.గంటా వ్యాఖ్యలతో టికెట్ విషయంలో ప్రజల్లో తనకు సానుభూతి వచ్చిందన్నారు.
నాలుగున్నరేళ్లలో ఎన్నో పోరాటాలు చేశానని వెల్లడించారు.పార్టీ మంచి నిర్ణయం తీసుకుంటుందని అనుకుంటున్నానని తెలిపారు.