కూరగాయ పంటలలో ఒకటైన క్యాప్సికం( Capsicum ) పంటకు మార్కెట్లో ఎప్పుడు మంచి డిమాండ్ ఉంటుంది.క్యాప్సికం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
క్యాప్సికం పంట సాగుకు 22 డిగ్రీల నుండి 25 డిగ్రీల మధ్య ఉండే ఉష్ణోగ్రత చాలా అనుకూలంగా ఉంటుంది.అధిక ఉష్ణోగ్రత పరిస్థితులు ఉంటే ఆశించిన స్థాయిలో అధిక దిగుబడి సాధించలేం.
క్యాప్సికం పంటను వేసే ముందు నేలను లోతు దుక్కులు దున్నుకొని, ఒక ఎకరాకు 12 టన్నుల కుళ్ళిపోయిన పశువుల ఎరుగును వేసి కలియదున్నాలి.ఇక నేలను భూసార పరీక్ష చేపించి, ఏవైనా పోషకాల లోపం ఉంటే ఆ పోషకాలను అందించాలి.

తెగులు నిరోధక ఆరోగ్యకరమైన( Pest resistant ) క్యాప్సికం నారును మాత్రమే ప్రధాన పొలంలో నాటుకోవడం కోసం ఎంపిక చేసుకోవాలి.ఇక మొక్కల మధ్య, మొక్కల వరుసల మధ్య సూర్యరశ్మితో పాటు గాలి బాగా తగిలే విధంగా నాటుకుంటే మొక్కలు ఆరోగ్యకరంగా పెరగడంతో పాటు వివిధ రకాల తెగుళ్లు లేదా చీడపీడలు ఆశిస్తే వ్యాప్తి ఎక్కువగా ఉండదు.క్యాప్సికం నారు వయస్సు 45 నుంచి 50 రోజుల మధ్య ఉంటేనే పొలంలో నాటుకోవాలి.నేలలోని తేమ శాతాన్ని బట్టి పది రోజుల వ్యవధిలో ఒకసారి నీటి తడులు అందిస్తుండాలి.

క్యాప్సికం పంటకు తీవ్ర నష్టం కలిగించే తెగుళ్ల విషయానికి వస్తే.అఫిడ్స్, త్రిప్స్ ( Aphids, thrips )కీలక పాత్ర పోషిస్తాయి.త్రిప్స్ తెగుళ్లు కీటకాల ద్వారా పంటకు సోకుతాయి.కీతకాలు ఆకుల నుండి పూర్తిగా రసాన్ని పీల్చివేస్తాయి.ఈ తెగుళ్ల నివారణకు 0.25% నికోటిన్ సల్ఫేట్ ను మొక్కల ఆకులు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.అఫిడ్స్ తెగుళ్లు కూడా కీటకాల ద్వారానే పంటను ఆశిస్తుంది.కీటకాలు మొక్క కణరసాన్ని పూర్తిగా పీల్చడం వల్ల తీవ్ర నష్టం కలుగుతుంది.0.05% డైమెటన్ మిథైల్ అప్లికేషన్స్ ద్వారా ఈ తెగులను పూర్తిగా అరికట్టి పంటను సంరక్షించుకోవాలి.







