బ్లౌజ్ వేసుకోకపోవడమే భారత కల్చర్.. చిన్మయి సంచలన కామెంట్స్ వైరల్!

స్టార్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి( Singer Chinmayi ) ఏం మాట్లాడినా సంచలనం అవుతుందనే సంగతి తెలిసిందే.

తాజాగా చిన్మయి సోషల్ మీడియా వేదికగా మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ అవుతున్నాయి.

ఇద్దరు యువకులు ఆడవాళ్లు చున్నీలు ధరించకపోవడం గురించి వీడియో చేయగా ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.ఈ వీడియో తన దృష్టికి రావడంతో చిన్మయి ఒకింత ఘాటుగా స్పందించారు.

రవీంద్రనాథ్ ఠాగూర్( Ravindranath Tagore ) అన్నయ్య భార్య బ్లౌజ్ కల్చర్ ను తీసుకొచ్చారని చిన్మయి చెప్పుకొచ్చారు.జాకెట్స్ తర్వాత పెట్టికోట్ కల్చర్ మొదలైందని ఆమె కామెంట్లు చేశారు.పాతకాలంలో చీరలను గమనిస్తే చీరనే జాకెట్టుగా మడిచి ధరించేవారని చిన్మయి అభిప్రాయపడ్డారు.

బ్లౌజ్, పెట్టికోట్ అనేవి ఈ మధ్య కాలంలో వచ్చాయని ఆమె కామెంట్లు చేశారు.ఇండియన్ కల్చర్( Indian Culture ) తెలియదా అని కామెంట్లు చేసే మగవాళ్లు కూడా ఇండియన్ కల్చర్ ను ఫాలో అయితే బాగుంటుందని చిన్మయి చెప్పుకొచ్చారు.

Advertisement

అలా కామెంట్లు చేసేవాళ్లు పంచెలు, ధోతీలు కట్టుకోవాలని చిన్మయి సలహా ఇచ్చారు.మన దేశ ఆడవాళ్లు బ్లౌజ్ ధరించకపోవడం చూసి బ్రిటిష్( British ) వాళ్లు షాకయ్యారని ఆమె పేర్కొన్నారు.

బ్రిటిష్ వాళ్ల బ్యాడ్ థింకింగ్ వల్లే మన దేశ ఆడవాళ్లు బ్లౌజ్ వేసుకోవడం జరిగిందని చిన్మయి చెప్పుకొచ్చారు.

పబ్లిక్ ప్లేసెస్ లో పాలివ్వడం కూడా కామన్ అని ఆమె అన్నారు.మీరు నమ్మకపోతే గూగుల్ చేసి ఈ విషయాలను తెలుసుకోండని బ్లౌజ్ వేసుకోకపోవడమే భారత కల్చర్ అని ఆమె పేర్కొన్నారు.ఇలాంటి రీల్స్ చూస్తుంటే ఎలా నా కొడుకును పెంచకూడదు అనే ఐడియాలు నాకు వస్తున్నాయని చిన్మయి చెప్పుకొచ్చారు.

చిన్మయి చేసిన కామెంట్లపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఆమె షేర్ చేసిన ఇన్ స్టాగ్రామ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు