చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై మంత్రి రోజా తీవ్రంగా మండిపడ్డారు.ఈ క్రమంలో వారి ఇద్దరికి ఆమె సవాల్ విసిరారు.
విడివిడిగా వచ్చినా.ఇద్దరూ కలిసి వచ్చినా సరేనన్న మంత్రి రోజా చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు.
ఇందుకోసం కుప్పంలోనైనా, నగరిలోనైనా.పవన్ ఓడిపోయిన చోటుకైనా వెళ్లి ఎవరు ఏం చేశారో చర్చిద్దామని తెలిపారు.
దీనికి ప్రజలే సరైన సమాధానం చెబుతారని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలోనే చర్చకు వచ్చే ధైర్యం తమకు ఉందన్న రోజా టీడీపీ, జనసేనకు ఉందా అని ప్రశ్నించారు.







