మన భారత కేంద్ర ప్రభుత్వం సరిగ్గా ఏడాది క్రితం అంటే 2020లో ఏకంగా 267 చైనీస్ యాప్ లపై ఐటీ యాక్ట్ సెక్షన్ 69A ప్రకారం యాప్స్ ను నిషేధించడం జరిగింది.ఇండియా, చైనాల మధ్య సరిహద్దు, దౌత్యపరమైన సంబంధాల విషయంలో సక్యత లేని కారణం చేత చైనాకి సంబందించిన కొన్ని యాప్స్ ను డిలీట్ చేసేసింది.
ఈ నేపథ్యంలో మన భారతదేశంలో అత్యంత అదరణ పొందిన టిక్ టాక్, లైకీ, యూసీ బ్రౌజర్, షేర్ఇట్, పబ్‌జీ, హెలో వంటి 267 రకాల యాప్ లను బ్యాన్ చేసిన విషయం అందరికి తెలిసిందే.అలా యాప్స్ పై నిషేధం విధించడం వలన చైనా దేశానికీ వేల కోట్ల రుపాయిల నష్టం వాటిల్లింది.
కానీ ఆ యాప్ లను మన కేంద్ర ప్రభుత్వం నిషేధించినప్పటికీ చైనా మాత్రం తన వక్ర బుద్దితో తమ దేశ యాప్ లను మళ్ళీ భారత్ లో ప్రవేశ పెడుతూనే ఉంది.
పాత యాప్ పేర్లను మార్చేసి వాటికి సరికొత్త హంగులు అమర్చి కొత్త కంపెనీల పేర్లతో యాప్స్ ప్రవేశ పెడుతున్నట్లు సమాచారం అందుతుంది.
ఈ క్రమంలో మళ్లీ మన భారతదేశంలో చైనీస్ యాప్ లు అధికంగా పెరుగుతున్నాయని చెప్పవచ్చు.ఇలా మన దేశంలో ఉన్న చాలా కంపెనీలు తమ చైనీస్ మూలాలను బయటకి రానివ్వకుండా కొత్త కొత్త కంపెనీ పేర్లతో తమ యాప్ లను ఇండియాలోకి విడుదల చేస్తున్నారు.
ఒక పరిశోధనలో భాగంగా నేడు మన భారతదేశంలో టాప్ లిస్ట్ లో ఉన్న 60 యాప్ లలో కనీసం 8 యాప్ లు చైనా దేశానివి అని తేలింది.ప్రతి నెలా 211 మిలియన్ల మంది యూజర్లను పెంచుకోవాలనేది ఈ అప్లికేషన్ల లక్ష్యమంట.
అంటే గత 13 నెలల్లో చైనీస్ యాప్ లలో మొత్తం 115 మిలియన్ల కొత్త యూజర్లు చేరినట్టు అంచనా వేస్తున్నారు.మరి చైనీస్ యాప్ లను బ్యాన్ చేసిన తరువాత కూడా మన భారత ప్రభుత్వం ఆ యాప్ లను ఎందుకు గుర్తించలేకపోతుందనే ప్రశ్న మీలో కలగవచ్చు.
అయితే ఇందుకు కారణం కూడా ఉంది.అది ఏంటంటే.

ఇండియాలో చాలా కంపెనీలు కొత్తగా వస్తున్నాయి.ఆ కంపెనీలలోనే భాగస్వామ్యం ఉన్న ఈ చైనా కంపెనీలు తమ మూలాలను దాచి పెట్టి తమ దిక్కుమాలిన తెలివి తేటలతో పబ్లిక్ డేటా ఇన్ఫర్మేషన్ కనిపించకుండా చేసి కొత్త కంపెనీ పేర్లతో తమ యాప్ లను రిలీజ్ చేస్తున్నాయి.అయితే ఈ యాప్ లు ఎక్కువగా మీడియా, ఎంటర్టైన్‌మెంట్ రంగానికి చెందినవి అవ్వడం గమనార్హం.చైనీస్ యాప్స్ బ్యాన్ విధించిన తరువాత ఇండియాలో బాగా యూజర్లను పెంచుకుంటున్న చైనీస్ యాప్ PLAYit.
ఈ యాప్ లో అన్ని రకాల ఓటీటీల ప్లాట్‌ఫారమ్స్ లోని స్టోరిలకు పైరసీ కాపీలు దొరుకుతాయన్నమాట.అందుకే ఈ యాప్ కి విశేష ఆధారణ లభిస్తుంది.
ఇంకా టిక్ టాక్, స్నాక్ వీడియో యాప్స్ బ్యాన్ చేసినాగాని ముసుగులో రన్నింగ్ అవుతూనే ఉన్నాయని తెలుస్తుంది.