అలా ఎలా సాధ్యం, చైనాలో తగ్గుతున్న మహమ్మారి

చైనా లో మొదలైన ఈ కరోనా మహమ్మారి ఇప్పడు ఆ దేశంలోనే తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తుంది.

గడచిన నాలుగు రోజులుగా అక్కడ కొత్తగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం.

దీనితో విశ్లేషకులు ఇది అలా సాధ్యం అయ్యింది అని ఆలోచనలో పడ్డారు.చైనాలో మొత్తం 81,008 కేసులు నమోదు కాగా, వారిలో 71,740 మంది రికవరీ బాటపట్టారు.

అలాగే వారిలో 3255 మంది మృతి చెందారు.అలాగే వీరిలో 6013 మందికి యాక్టివ్ కేసులు ఉండగా, అందులో 4086 మందికి తగ్గుముఖం పడుతుండగా, 1927 మందికి మాత్రం క్రిటికల్ గా ఉంది.71,740 మంది డిశ్చార్జి అయ్యారు.గత నెల ఫిబ్రవరి 12 తేదీన అత్యధికంగా ఒకే రోజు 14108 కేసుల నమోదు కాగా, నెల తిరిగే సరికి మార్చి 12 నాటికి పాజిటివ్ కేసుల సంఖ్య సున్నా కు చేరుకుంది.

దీన్ని బట్టి చైనా కరోనాపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టిందని అర్ధం అవుతుంది.అర్థం చేసుకోవచ్చు.కరోనాను కట్టడి చేసేందుకు ప్రజలను సమూహాలుగా తిరగకుండా నిరోధించాలి.

Advertisement

ఇందుకోసం కేవలం ప్రకటనలకు పరిమితం కాకుండా.చైనా ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ అమలుచేసింది.

ఇందుకోసం సైన్యాన్ని రంగంలోకి దింపింది.రోడ్ల మీద జన సంచారం లేకుండా చేసింది.

షాంఘై, వూహాన్, బీజింగ్ లాంటి పట్టణాల్లో ప్రజలు రోడ్ల మీదకు రాకుండా చేసింది.నిత్యవసరాలను ఇంటి వద్దకే సరఫరా చేసేలా చర్యలు తీసుకుంది.

అంతేకాదు ప్రజల్లో భయాందోళనలకు తలెత్తకుండా మీడియా పై కూడా నియంత్రణ చేసింది.అలాగే ఆసుపత్రుల్లో బెడ్స్ సంఖ్యను అమాంతంగా పెంచడంతో పాటు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

కేవలం ఆరు రోజుల్లోనే 269000 చదరపు అడుగుల స్థలంలో వెయ్యి పడకల ఆసుపత్రిని నిర్మించింది.అయితే 2003 లో కూడా చైనా లో సార్స్ వైరస్ సోకినప్పుడు కూడా ఇలాంటి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి కట్టడి చేసింది అని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

మొత్తానికి చైనా లో మొదలైనట్లుగా చెబుతున్న ఈ వైరస్ చైనా లో పూర్తి స్థాయిలో కట్టడి చేయగలిగారు.

తాజా వార్తలు