జాగ్రత్త : కరోనా వైరస్‌ అంటే ఏంటీ? దాని నుండి ఎలా దూరంగా ఉండాలి

ప్రపంచ దేశాలను గడగడలాడించే సత్తా ఉండి.

ఇతర దేశాల కంటే టెక్నాలజీలో మరియు ఇతర విషయాల్లో చాలా ముందు ఉండే అమెరికా మరియు చైనా సహా పలు అభివృద్దిలో దూసుకు పోతున్న దేశాలు ప్రస్తుతం కరోనా వైరస్‌కు గజగజలాడిపోతున్నాయి.

ముఖ్యంగా చైనా తమ దేశంలోని అయిదు పెద్ద నగరాల్లో ఈ వైరస్‌ను గుర్తించి ప్రస్తుతం ఆ నగరాలను పూర్తిగా కర్నార్‌ చేసింది.అంటే ఆ నగరాల నుండి పురుగు కూడా బయటకు రాకుండా.

ఆ నగరాల్లోకి మరెవ్వరు పోకుండా పూర్తిగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది.ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే ఉండాల్సిందిగా ఆదేశాలు జారీ చేసి రోడ్లపై ఏకంగా 144 సెక్షన్‌ను విధించినట్లుగా అక్కడ పరిస్థితి ఉందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ప్రపంచ దేశాలను ఇంతగా భయపెడుతున్న కరోనా వైరస్‌ అంటే ఏంటీ, దీని వల్ల కలిగే నష్టం ఏంటీ ఇప్పుడు చూద్దాం.కరోనా వైరస్‌లో చాలా రకాలు ఉంటాయి.

Advertisement

మనిషికి చిన్న అనారోగ్య సమస్య నుండి ప్రాణాలు తీసే వరకు కూడా ఈ వైరస్‌లో రకాలు ఉన్నాయి.ప్రస్తుతం జనాలను ఒణికిస్తున్న వైరస్‌కు 2019 ఎన్‌ సీవోవీ అంటూ పేరు పెట్టారు.

ఈ వైరస్‌ ఎక్కువగా గబ్బిలాల్లో ఉంటుంది.అయితే గబ్బిలాల్లో ఉండే ఈ వైరస్‌ ఇన్నాళ్లు ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు.

కాని ఎప్పుడైతే ఈ వైరస్‌ పాములో ఉండే వైరస్‌తో ఏ విధంగా కలిసిందో కాని అప్పటి నుండి విజృంభించడం మొదలు పెట్టింది.గబ్బిలంలో ఉండే కరోనా వైరస్‌ పాములో ఉండే కరోనా వైరస్‌తో కలవడంతో పరిస్థితి సీరియస్‌గా మారింది.

ఈవైరస్‌ సోకిన వారు రోజులు లేదా వారాల్లో ఖచ్చితంగా మృతి చెందుతారు అంటూ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పలు ఫార్మా కంపెనీలు ఈ వైరస్‌కు మందు కనిపెట్టే పనిలో ఉన్నారు.ఇన్నాళ్లు దీని గురించి ఆందోళన లేదు.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
బీజేపీ కార్మిక, కర్షక వ్యతిరేక పార్టీ.. మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు

కనుక మందు కనిపెట్టేందుకు ఎవరు పెద్దగా ఆసక్తి చూపించలేదు.ఎప్పుడైతే ఈ వైరస్‌ మొదలైందో అప్పటి నుండి ప్రయోగాలు మొదలు అయ్యాయి.

Advertisement

ఇండియాలో ముంబయిలో ఈ వైరస్‌ను గుర్తించినట్లుగా వైధ్యులు చెప్పారు.విదేశాల నుండి వచ్చిన ఇద్దరికి ఈ వైరస్‌ ఉన్నట్లుగా గుర్తించి వెంటనే వారిని ప్రత్యేక చికిత్స కేంద్రంకు తరలించారు.వీరితో పాటు ఇండియాలో ఈ వైరస్‌ వ్యాప్తి చెందిందా లేదా అనేది మరికొన్ని గంటలు ఆగితే కాని తెలియదు.

అందుకే ముంబయితో సహా మెట్రో నగరాల్లో ఉంటున్న వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.మొహంకు పూర్తిగా మాస్క్‌ వేసుకుని వెళ్తేనే బెటర్‌.ఈమద్య కాలంలో ఏమైనా విదేశీ ప్రయాణాలు ఉంటే రద్దు చేసుకోవడం కూడా మంచిదే.

తాజా వార్తలు