హిలేరియస్, ప్రెసిడెంట్ చుట్టూ సైకిల్‌పై బాలుడు చక్కర్లు.. వీడియో వైరల్!

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక హిలేరియస్ వీడియో వైరల్ గా మారింది.ఈ వీడియోలో ఒక బుడ్డోడు సూప‌ర్‌మ్యాన్ కాస్ట్యూమ్ ధరించి ఒక దేశాధ్యక్షుడు ప్రసంగించే స్టేజ్‌పై సైకిల్ తొక్కుతూ చక్కర్లు కొట్టాడు.

 Hilarious, A Boy Cycles Around The President Video Goes Viral, Chile, President-TeluguStop.com

జోక్ ఏంటంటే, అతడు ఏమాత్రం భయం లేకుండా ఏకంగా ఆ అధ్యక్షుడు చుట్టే తిరుగుతూ ఎంజాయ్ చేశాడు.దేశాధ్యక్షుడు చాలా ముఖ్యమైన అంశం పై సీరియస్ గా మాట్లాడుతుంటే అతని వెనకే చాలామంది అఫీషియల్స్ ఉన్నారు.

వారందరూ కూడా ఆ చిన్న పిల్లోడు సైకిల్‌పై తిరుగుతూ ఉంటే బిత్తరపోయి చూశారు.దీనికి సంబంధించిన వీడియోని @డేవిడ్ యాడ్‌లర్ అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేశారు.

దీనికి ఇప్పటికే లక్షా 30 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.

వివరాల్లోకి వెళితే.

ఇటీవల చిలీ దేశాధ్య‌క్షుడు గాబ్రియేల్ బోరిక్ కొత్త రాజ్యాంగం స్వీకరించే విషయంలో తన ఓటును వేశారు.తర్వాత ప్రజలను ఉద్దేశించి ఒక ఇంపార్టెంట్ స్పీచ్ ఇచ్చారు.

ఆయన తన ప్రసంగంలో ఏం మాట్లాడారో ఎవరూ పట్టించుకోలేదు.ఎందుకంటే అతను మాట్లాడేటప్పుడు ఒక బుడ్డోడు చిన్న బ్లూక‌ల‌ర్ సైకిల్‌పై స్టేజి మీదకు దూసుకొచ్చాడు.

అనంతరం ఆ అధ్యక్షుడు చుట్టూ పలుమార్లు తిరుగుతూ అందర్నీ నోరెళ్లబెట్టిలా చేశాడు.ఈ దృశ్యం చూసి ప్రజలు కూడా అవాక్కయ్యారు.

ఇంతలోనే ఒకరు ఈ ఫన్నీ సన్నివేశాన్ని తన కెమెరాలో బంధించారు.అనంతరం అది సోషల్ మీడియాలో అప్‌లోడ్ అయి ఇప్పుడు వైరల్ గా మారింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.ఈ పిల్లోడు మామూలోడు కాదు చిచ్చరపిడుగు అని కామెంట్స్‌ చేస్తున్నారు.బహుశా ఈ సూపర్ మ్యాన్ అతడికి 360 డిగ్రీస్‌లో టైట్ సెక్యూరిటీ ఇస్తున్నాడో ఏమో అని కొందరు నెటిజన్లు ఫన్నీలా కామెంట్ చేస్తున్నారు.అదే ఇండియాలో అయితే కనీసం సర్పంచ్ దగ్గరికి కూడా ఇలాగ రానివ్వరు, చిలీ దేశ నాయకులు చాలా కూల్ అని ఇంకొందరు కామెంట్స్ పెడుతున్నారు.

ఈ వీడియో పై మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube