తెలంగాణ అసెంబ్లీ( Telangana Assembly ) ఆవరణలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఛాంబర్ ను( KCR Chamber ) రాష్ట్ర ప్రభుత్వం మార్చింది.ఆయనకు చిన్న ఛాంబర్ ను సర్కార్ కేటాయించింది.
ముందు కేటాయించిన కార్యాలయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.స్పీకర్ కార్యాలయ అవసరాల కోసం కేటాయించినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో కేసీఆర్ ఛాంబర్ మార్పు వ్యవహారంపై బీఆర్ఎస్ నేతలు( BRS Leaders ) తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.ఇందులో భాగంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు స్పీకర్ ను కలిసి ఫిర్యాదు చేసేందుకు వెళ్లారని సమాచారం.కేసీఆర్ కు( KCR ) ప్రస్తుతం కేటాయించిన ఛాంబర్ సరిపోదని, కార్యాలయాని మార్చాలని స్పీకర్ ను కోరనున్నారు.