Governor Tamilisai : ప్రజల కొరకు ప్రభుత్వం పని చేస్తుంది..: గవర్నర్ తమిళిసై

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభం అయ్యాయి.ఈ నేపథ్యంలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ( Governor Tamilisai )ప్రసంగించారు.

 Governor Tamilisai : ప్రజల కొరకు ప్రభుత్వం-TeluguStop.com

తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యం కోసం పోరాడారని తమిళిసై తెలిపారు.రెండు గ్యారెంటీలను ఇప్పటికే అమలు చేశామన్నారు.

మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో( Free Travel For Women ) ఉచిత ప్రయాణం కల్పించామని తెలిపారు.ఆరు గ్యారెంటీల అమలుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే కంచెను తొలగించామని చెప్పారు.ప్రజా పాలన( Praja Palana )లో గ్రామ సభలు నిర్వహిస్తున్నామని, పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్ట్, రెండు లక్షల ఉద్యోగాలపై ఫోకస్ పెట్టామని తెలిపారు.మౌలిక వసతుల రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.ప్రజలపై భారం వేయకుండా ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.ప్రజలపై భారం వేయకుండా ఆర్థిక సంస్కరణలు చేపడుతున్నామని తెలిపారు.ఈ క్రమంలోనే దావోస్ లో రూ.40 వేల కోట్ల పెట్టుబడులపై ఒప్పందాలు జరిగాయని తెలిపారు.ప్రజల కొరకు ప్రభుత్వం పని చేస్తుందని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube