తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేకు ఆ పార్టీ నేత చెరుకు సుధాకర్ ఫిర్యాదు చేశారు.ఈ క్రమంలో కోమటిరెడ్డిపై ఇంఛార్జ్ కు కంప్లైంట్ చేసినట్లు సుధాకర్ తెలిపారు.
పార్టీకి నష్టం చేసే చర్యలు చేయను.క్షమాపణ చెప్పాలని కూడా అడగనని సుధాకర్ వెల్లడించారు.
కోమటిరెడ్డి వల్ల మునుగోడులో పార్టీకి నష్టం జరిగినా.పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదని తెలిపారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్షమాపణ చెప్పాలని తను అడగలేదని పేర్కొన్నారు.ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరానని స్పష్టం చేశారు.







