ఐపీఎల్ లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వాడిన చెన్నై - గుజరాత్.. పోరాడి గెలిచిన గుజరాత్..!

ఐపీఎల్ సీజన్-16 లో ఐదు కొత్త రూల్స్ లలో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కూడా ఒకటి.నిన్న అహ్మదాబాద్ వేదికగా జరిగిన చెన్నై- గుజరాత్ తొలి మ్యాచ్లో ఇరుజట్లు వాడేశాయి.

 Chennai-gujarat Used Impact Player Rule In Ipl..gujarat Fought And Won , Gujara-TeluguStop.com

తొలి మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఉత్కంఠ భరితంగా సాగింది.గుజరాత్ జట్టు పోరాడి తొలి విజయం ఖాతాలో వేసుకుంది.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని కొత్త నిబంధన అయిన ఇంపాక్ట్ ప్లేయర్ ని వెటర్నన్ బ్యాట్స్మెన్ అంబటి రాయుడు స్థానంలో ఫాస్ట్ బౌలర్ తుషార్ దేశ్ పాండే( Tushar Deshpande )ను పంపి ఉపయోగించాడు.తుషార్ దేశ్ పాండే గ్రౌండ్లో ఉన్నంతసేపు రాయుడు గ్రౌండ్లో అడుగుపెట్టలేదు.

చెన్నై సూపర్ కింగ్స్( Chennai Super Kings) జట్టు బ్యాటింగ్ తర్వాత బౌలింగ్ కు ముందు ఇంపాక్ట్ ప్లేయర్ ను రంగంలోకి దించింది.అంబటి రాయుడు 12 బంతుల్లో 12 పరుగులు చేశాడు.

అతను ఐదు ఆటగాళ్ల పేర్లను సబ్ స్టిట్యూట్లుగా ఇచ్చాడు.చెన్నై జాబితాలో తుషార్ దేశ్ పాండే, షేక్ రషీద్, అజింక్య రహానే, సుభ్రాంశు సేనాపతి ఉన్నారు.

ఇక గుజరాత్ జట్టు విషయానికి వస్తే కెన్ విలియమ్సన్ స్థానంలో ఎడమచేతి వాటం బ్యాట్స్ మెన్ సాయి సుదర్శన్( Sai Sudharsan ) మొదటి ఇంపాక్ట్ ప్లేయర్ అయ్యాడు.

గుజరాత్( Gujarat Titans ) జట్టు ఫిల్లింగ్ చేస్తున్న సమయంలో కెన్ విలియమ్సన్ మోకాలికి గాయం కారణంగా బ్యాటింగ్ చేసే సమయంలో సాయి సుదర్శన్ ను ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకున్నారు.

సుదర్శన్ 17 బంతుల్లో 22 పరుగులు చేశాడు.బీసీసీఐ సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీ టోర్నమెంట్ సందర్భంగా ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను కొత్తగా ప్రవేశపెట్టింది.

ఐపీఎల్ లో చేర్చాలని బీసీసీఐ నిర్ణయించింది.ఈ నిబంధన ప్రకారం మ్యాచ్ జరిగే సమయంలో ఒక ఆటగాడి స్థానంలో మరో ఆటగాడిని 12వ ప్లేయర్గా చేర్చుకోవచ్చు.

కానీ బయటకు పంపబడిన ఆటగాడు ఆ మ్యాచ్లో మళ్లీ పాల్గొనలేడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube