Rani Mukherjee : పాప పుట్టినప్పుడు తీవ్ర ఒత్తిడికి గురయ్యాను.. రాణీ ముఖర్జీ కామెంట్స్ వైరల్?

బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ( Rani Mukherjee ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ఈమె సుపరిచితమే.1998 లో కుచ్ కుచ్ హోతా హై సినిమాతో భారీగా క్రేజ్ ని ఏర్పరచుకుంది.ఆ తరువాత రాజా కీ ఆయేగీ బారాత్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

 Rani Mukerji Says Daughter Adira Was Two Months Premature-TeluguStop.com

ఈ సినిమాతో హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్న రాణి ముఖర్జీ ఆ తర్వాత బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించింది.

Telugu Filmfare Awards, Adira, Adithya Chopra, Bollywood, Rani Mukerji-Movie

కేవలం బాలీవుడ్ లో మాత్రమే కాకుండా టాలీవుడ్ లో కూడా అభిమానులను సంపాదించుకుంది.అలాగే ఆమె ఎన్నో సినిమాలకు ఫిలింఫేర్ పురస్కారాలు కూడా అందుకుంది.ఇప్పటివరకు ఆమె దాదాపుగా 7 ఫిలింఫేర్ అవార్డులను( 7 Filmfare Awards ) సైతం సొంతం చేసుకుంది.

ఇది ఇలా ఉంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాణి ముఖర్జీ తన కెరియర్లో ఎదురైనా ఒక చేదు అనుభవం గురించి ఆమె చెప్పుకొచ్చింది.రాణి ముఖర్జీ 2014లో బాలీవుడ్ నిర్మాత ఆదిత్య చోప్రాని( Aditya Chopra ) వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

ఏడాది తర్వాతే ఓ పాపకు కూడా జన్మనిచ్చారు.

Telugu Filmfare Awards, Adira, Adithya Chopra, Bollywood, Rani Mukerji-Movie

ఆ తర్వాత నటనకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు.అయితే ప్రసవ సమయంలో రాణీ ముఖర్జీకి ఎదుర్కొన్న చేదు సంఘటనను తాజాగా ఆమె గుర్తు చేసుకున్నారు.మొదటిసారి బిడ్డను చూసినప్పుడు తన ఫీలింగ్‌ను ఆమె పంచుకున్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.నా కుమార్తె నెలలు నిండకుండానే పుట్టింది.

నిర్ణీత సమయానికి రెండు నెలల ముందే బిడ్డకు జన్మనిచ్చాను.పాప అప్పుడు చాలా సన్నగా ఉంది.

దాంతో నేను తీవ్ర ఒత్తిడికి గురయ్యాను.ఒక తల్లిగా నాకు చాలా బాధ కలిగింది.

పాపను దాదాపు 7 రోజులు ఐసీయూలో ఉంచారు.దీంతో అక్కడ 15 రోజులు ఉండాల్సి వచ్చింది.

కానీ అదృష్టవశాత్తూ దేవుడి దయ వల్ల నా బిడ్డ క్షేమంగానే తిరిగొచ్చింది.మన జీవితంలో ఒకరిని ఎందుకు అంతగా ప్రేమిస్తామో మొదటిసారి తెలిసొచ్చింది.

ఆ క్షణం నా బిడ్డ కంటే నాకేదీ ముఖ్యం కాదనిపించింది అని తెలిపింది రాణి ముఖర్జీ.తన కుమార్తెకు ఆదిరా అనే పేరు పెట్టారు.

ఆదిరా పుట్టిన తరువాత ఆమె నటనకు గుడ్ బై చెప్పేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube