భారత సంతతికి చెందిన ప్రఖ్యాత చెఫ్ గగన్ ఆనంద్ సింగపూర్ వాసులకు భారతీయ రుచులను అందించనున్నారు.స్థానిక క్రెయిగ్ రోడ్‌లో అక్టోబర్ 24న తన మెక్సికన్- ఇండియన్ రెస్టారెంట్‌ను ప్రారంభించనున్నారు.
స్థానిక హాస్పిటాలిటీ గ్రూప్ అయిన ది ప్రాపర్ కాన్సెప్ట్స్ కలెక్టివ్ సహకారంతో ఆనంద్ తన ‘‘ Ms.Maria & Mr.Singh ’’ రెస్టారెంట్ ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు.
Ms.
Maria & Mr.Singh రెస్టారెంట్‌ను తొలుత థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ప్రారంభించారు ఆనంద్.మెక్సికన్ అమ్మాయి, భారతీయ అబ్బాయి మధ్య కల్పిత ప్రేమ కథ ఆధారంగా.ఈ రెస్టారెంట్‌లోనూ మెక్సికన్, భారతీయ రుచులను అందిస్తున్నారు.కోల్డ్ కర్రీ సెవిచే, లాంబ్ కీమా క్యూసాడిల్లా, పోర్క్ విండలూ టాకో వంటి వంటకాలు ఇందులో దొరుకుతాయి.సింగపూర్‌లో ప్రారంభించనున్న రెస్టారెంట్‌లో భారతీయ స్ట్రీట్ ఫుడ్ అయిన పాప్డీ చాట్, క్రాబ్ కర్రీలను ఇక్కడి ప్రజలకు రుచి చూపించనున్నారు.
డెజర్ట్‌లలో ఫలూడా, అవకాడో మూసీ, మ్యాంగో యుజుజెల్, చింతపండు చట్నీలతో కూడిన ఫోమ్ గ్రాస్ పన్నా కోట, చుర్రోస్‌లు వుంటాయి.

ఇక ధరల విషయానికి వస్తే.12 సింగపూర్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.693) నుంచి 28 సింగపూర్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.1,618) వరకు వుంటాయి.అయితే కాక్‌టెయిల్ ధరలు మాత్రం ఇంకా విడుదల చేయలేదు.
Ms.Maria & Mr.Singh సింగపూర్‌లో గగన్ ఆనంద్‌కు తొలి రెస్టారెంట్.ఆయన ఈ ఏడాది జూన్ వరకు మండల క్లబ్‌లో పాప్ అప్‌ను నడిపారు.
ఇదిలావుండగా.భారతీయ కుబేరుడు , రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కూడా సింగపూర్‌లో ఫ్యామిలీ ఆఫీస్ తెరిచేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.ఇప్పటికే కార్యాలయం కోసం భవనాన్ని ఎంపిక చేయగా.సిబ్బంది నియామక ప్రక్రియ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.
ఏడాదిలోగా ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.







