చాట్‌జీపీటీ( ChatGPT ) AI ట్యూటర్‌గా పనిచేస్తూ విద్యార్థులకు కష్టమైన కాన్సెప్ట్‌లను అర్థం చేసుకోవడానికి, వారి గ్రేడ్‌లను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే దీనితో మరిన్ని ప్రయోజనాలు కలుగుతున్నాయి.
చాట్‌జీపీటీ ప్లస్ మాట్లాడగలిగే పర్సనల్ టీచర్‌గా సమర్థవంతంగా పనిచేస్తుంది.ఖరీదైన ట్యూటర్‌ల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయడం లేదా ఆన్‌లైన్‌లో సమాధానాల కోసం వెతకడానికి బదులుగా, ఈ AI ట్యూటర్ మరింత సరసమైనది, సమర్థవంతమైనదిగా నిలుస్తోంది.

అయితే ఇటీవల ఒక విద్యార్థి 20 డాలర్లు (సుమారు రూ.1,500) పెట్టి చాట్‌జీపీటీ ప్లస్( ChatGPT Plus )) కొనుగోలు చేసి దానితో తనకు కలిగిన అనుభవాన్ని పంచుకున్నాడు.చదువులతో కుస్తీ పట్టే ఈ స్టూడెంట్ AI ట్యూటర్( Ai Tutor ) సహాయంతో తన గ్రేడ్‌లను భారీగా మెరుగుపరచుకోగలిగాడు. ఆర్గానిక్ కెమిస్ట్రీ, జనరల్ కెమిస్ట్రీ వంటి సబ్జెక్టులలో చాలా తక్కువ స్కోర్‌ల నుంచి భారీ స్కోర్ చేయగలిగాడు.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, పరీక్షలకు ముందు కేవలం నాలుగు రోజులు బాగా స్టడీ చేయడం ద్వారా ఈ స్టూడెంట్ డీసెంట్ స్కోర్ సాధించగలిగాడు.

ఈ స్టూడెంట్ తన స్టడీని మరింత సులభతరంగా మార్చేందుకు మెటీరియల్‌లను చాట్‌జీపీటీకి ఇచ్చి, ఈజీ సమ్మరీని రాబట్టగలిగాడు.చాట్‌జీపీటీ సంక్లిష్ట కాన్సెప్ట్‌లను సులభతరం చేసింది.అన్ని విషయాలు చాలా క్లియర్ గా అర్థమయ్యేందుకు ఎగ్జాంపుల్స్ కూడా అందించింది.
విద్యార్థి చదువుతున్న టాపిక్ క్లిష్టతను బట్టి చాట్‌జీపీటీ విభిన్న వెర్షన్ల మధ్య చేంజ్ అయింది.
చాట్‌జీపీటీ 100% కచ్చితమైనది కానప్పటికీ, కొన్నిసార్లు తప్పుడు సమాచారాన్ని అందించినప్పటికీ, ఆ తప్పులను పట్టుకోవడంలో మెటీరియల్‌ని లోతుగా అర్థం చేసుకోవడంలో ఇది సహాయపడిందని విద్యార్థి కనుగొన్నాడు.
అదనంగా, Wolfram Alpha అనే ప్లగిన్‌ని ఉపయోగించడం ద్వారా ఈ స్టూడెంట్ అధిక స్కోర్ చేశాడు.