అదేంటి, కరెంట్ లేకపోతే ఫ్రిడ్జ్( Fridge ) ఎలా పనిచేస్తుంది? అనే అనుమానం కలుగుతోంది కదూ.ఆ విషయం తెలియాలంటే ఈ పూర్తి కధనం చదవాల్సిందే.
బేసిగ్గా మధ్యతరగతి ప్రజలు ఫ్రిడ్జ్‌లు కొనుగోలు చేయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి.ఎందుకంటే దానికి 10 వేల లోపు అయితే ఫ్రిడ్జ్ ని కొనడం కష్టం.
పైగా ఎన్ని వేలు పెట్టి కొన్నా దానికి కరెంట్( Current ) ఉంటేనే పనిచేస్తుంది, లేదంటే లేదు.అయితే ఇపుడు అంతకంటే తక్కువ ధరలలో పైగా కరెంట్ తో పనిలేకుండా పనిచేసే ఫ్రిడ్జ్ గురించి తెలుసుకుందాం.

పైన ఫోటోను మీరు గమనిస్తే ఓ పెట్టెలా కనిపిస్తోంది కదూ.అదొక చల్లటి ఫ్రిడ్జ్. ఈ ఫ్రిడ్జ్‌కు కరెంట్‌తో పనిలేదు సుమా.సామాన్యులకు భారం కాకుండా.కరెంట్ బిల్లును ఏమాత్రం పెంచకుండా ఈ చల్లటి ఫ్రిడ్జ్‌లు ఇపుడు మార్కెట్లోకి వచ్చాయి.కోయంబత్తూరుకు( Coimbatore ) చెందిన మన్‌సుక్ భాయ్ అనే వ్యక్తి ఈ ఫ్రిడ్జ్‌ను సహాజ సిద్దంగా పర్యావరణలో దొరికే మట్టితో తయారు చేయడం విశేషం.
దీనికి మిట్టి కూల్ ఫ్రిడ్జ్( Mitti Cool Fridge ) అని పేరు పెట్టాడు.దీన్ని పూర్తిగా బంకమన్నుతో తయారు చేయడం విశేషం.
ఈ ఫ్రిజ్‌కు విద్యుత్‌తో అవసరం లేదు.అలాగే ఎలాంటి మరమ్మత్తులు కూడా చేయాల్సిన పన్లేదు.

ఇందులో భద్రపరిచిన కూరగాయలు సుమారు ఐదారు రోజులు తాజాగా ఉంటాయని చెబుతున్నాడు.ఇంకా పెరుగు, దోశె పిండిలాంటివి కూడా ఈ ఫ్రిడ్జ్‌లో పెడితే పుల్లబడకుండా తాజాగా ఉంటాయని భోగట్టా.ఇక ఓ సాధారణ ఫ్రిడ్జ్‌లో ఏవైతే పెడతారో అలాంటివి ఇందులో పెట్టుకోవచ్చని సమాచారం.దానికి మీరు ఈ మిట్టి కూల్ ఫ్రిడ్జ్‌పైన అమర్చిన అరలో 2 లీటర్ల నీళ్లు పోస్తే సరిపోతుంది.
ఇక దీని నిర్వహణా ఖర్చు కూడా తక్కువే.కాగా విద్యుత్ అవసరం లేని ఈ ఫ్రిడ్జ్ ఖరీదు చాలా తక్కువ.దీని ధర కేవలం రూ.8,500 మాత్రమే.







