ఏపీ అసెంబ్లీ( AP Assembly ) సమావేశాల్లో చివరి రోజు తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది.జాబ్ క్యాలెండర్, మద్యపాన నిషేధంపై టీడీపీ సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు.
కానీ టీడీపీ సభ్యులు( TDP Members ) ఇచ్చిన తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం( Speaker Thammineni Seetharam ) తిరస్కరించారు.
దీంతో టీడీపీ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు.రాష్ట్రంలో మద్యపాన నిషేధం ఎక్కడ? జాబ్ క్యాలెండర్ ఎక్కడంటూ నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు.టీడీపీ సభ్యుల ఆందోళనలు కొనసాగుతుండగానే స్పీకర్ తమ్మినేని సమావేశాల్లో టీ బ్రేక్ ప్రకటించారు.