మెగాస్టార్ మూవీ కథతో దిగుతున్న మాస్ రాజా

మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘క్రాక్’ రిలీజ్‌కు రెడీ అయ్యింది.ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది.

అయితే ఈ సినిమాలో రవితేజ పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ చిత్రాలను లైన్‌లో పెట్టే పనిలో పడ్డాడు ఈ హీరో.

ఇప్పటికే దర్శకుడు నక్కిన త్రినాథరావు తెరకెక్కించే సినిమాను ఓకే చేశాడు.అయితే ఈ సినిమా కథ మెగాస్టార్ చిరంజీవి నటించిన ఓ సూపర్ హిట్ మూవీని పోలి ఉండటంతో ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా చూస్తున్నాయి చిత్ర వర్గాలు.

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘చంటబ్బాయి’ చిత్రం ఆయన కెరీర్‌లో కామెడీ ఎంటర్‌టైనర్‌గా అదిరిపోయే హిట్ అందుకుంది.జంధ్యాల తెరకెక్కించిన ఈ సినిమాలో చిరు తన పర్ఫా్ర్మెన్స్‌తో ప్రేక్షకులను మెప్పించాడు.

Advertisement

ఇప్పుడు ఇలాంటి సజ్జెక్టుతోనే నక్కిన త్రినాథరావు ఓ కథను రెడీ చేసి రవితేజతో తెరకెక్కించాలని చూస్తున్నాడు.తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్వించడంలో రవితేజ తనదైన మార్క్ వేసుకున్నాడు.

గతంలో ‘కిక్’ సినిమాతో ప్రేక్షకులకు ఎలాంటి కామెడీని పంచాడో అందరికీ తెలిసిందే.కానీ ఆ సినిమా తరువాత అంతటి కామెడీ టైమింగ్ ఉన్న సినిమాను రవితేజ చేయలేదని చెప్పాలి.

కిక్ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ కూడా రవితేజ ఖాతా పడలేదు.దీంతో ఈ సినిమాతో అలాంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకునేందుకు రవితేజ రెడీ అవుతున్నాడు.

మరి చంటబ్బాయి లాంటి కథతో వస్తున్న రవితేజ, అలాంటి విజయాన్ని అందుకుంటాడా లేడా అనేది చూడాలి.

బీజేపీ కార్మిక, కర్షక వ్యతిరేక పార్టీ.. మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు
Advertisement

తాజా వార్తలు