విజిటింగ్ వీసా నిభందనలు మార్పు...!!!

అమెరికాలో ప్రవేశించడానికి వీలుగా ఉండే విజిటింగ్ వీసాలపై అమెరికా మరిన్ని కటినమైన నిభంధనల్ని పెట్టడానికి ప్రయత్నాలు చేస్తోంది తెలుస్తోంది.

ఈ వీసాపై అమెరికాలో ప్రవేశించాలని అనుకునే వారు గడ్డు పరిస్థితులు ఎదుర్కోక తప్పదని అంటున్నారు నిపుణులు.

అందుకు తగ్గట్టుగా ట్రంప్ పావులు కదుపుతున్నారు.విజిటింగ్‌ వీసాదారులని ఆదుకునేందుకు వీలుగా త్వరలో అడ్మిషన్ బాండ్ ని ప్రవేశపెట్టనున్నట్టుగా అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది.

దాంతో అమెరికాని సందర్శించేందుకు వచ్చే పర్యాటకులు ,వ్యాపార వేత్తలు, ప్రధానంగా భారతీయులు ఎక్కువగా ఇబ్బందులు పడే అవకాశం ఉందని తెలుస్తోంది.అయితే ఈ మేరకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్టేట్‌ అండ్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీకి వైట్ హౌస్ నుంచీ కీకల ఆదేశాలు అందాయని తెలుస్తోంది.

ప్రధానంగా అమెరికాకు వచ్చే బిజినెస్ , మరియు ఇతర నాన్ ఇమ్మిగ్రెంట్‌ వీసాలను తగ్గించే దిశగా ట్రంప్ చర్యలని చేపట్టనున్నారని తెలుస్తోంది.

Advertisement
వివేక్ రామస్వామి పదవిపై డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన

తాజా వార్తలు