తెలంగాణలో స్కూల్ టైమింగ్స్ మార్పు ప్రభుత్వం కీలక ఆదేశాలు..!!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల టైమింగ్స్( Telangana State School Timings ) విషయంలో మార్పులు చేసింది.ప్రైమరీ స్కూళ్లు (1-5వ తరగతి) ఉ.

9.30 నుంచి సా.4.15 వరకు, అప్పర్ ప్రైమరీ స్కూళ్లు (6-10వ తరగతి) ఉ.9.30 నుంచి సా.4.45 వరకు పనిచేయాలని ఆదేశించింది.అప్పర్ ప్రైమరీ స్కూళ్లలోని ప్రైమరీ స్కూళ్లు కూడా ఉ.9.30 నుంచి సా.4.15 వరకే పని చేయాలంది.హైదరాబాద్, సికింద్రాబాద్ మినహా రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లలో ఇవే టైమింగ్స్ పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు( Heavy Rains ) కురుస్తూ ఉన్నాయి.గత వారంలోనే వర్షాలు కారణంగా మూడు రోజులు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.

అయితే ఇప్పుడు మరోసారి వాతావరణ శాఖ మరికొన్ని రోజులు భారీ వర్షాలు అని హైదరాబాద్ వాతావరణ శాఖ( Hyderabad Meteorological Department ) ప్రకటన చేయడం జరిగింది.దీంతో ప్రస్తుత పరిస్థితులను అధికారులు సమీక్షిస్తూ ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు.చాలా పాఠశాలలలో వర్షపు నీళ్ళు చేరుకున్నట్లు పైకప్పుల నుంచి నీళ్లు జారబడి వర్షపు గదిలో కారుతోందని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.

దీంతో తాజా పరిస్థితుల క్రమంలో స్కూళ్లకు సెలవులు ప్రకటించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement
ఏంటి హార్దిక్ అంత సింపుల్ గా ఆడేసావ్.. 'నో లుక్ షాట్' వైరల్

తాజా వార్తలు