తెలంగాణ వచ్చాక కూడా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డి అన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందన్నారు.
తెలంగాణలో బీజేపీతోనే మార్పు సాధ్యమని స్పష్టం చేశారు.టీఆర్ఎస్ ను ఎదుర్కొవడం కాంగ్రెస్ వల్ల కాదని తెలిపారు.
టీఆర్ఎస్ ను గద్దె దించడానికి తన వంతు కృషి చేస్తానన్నారు.దేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్తున్నారని వెల్లడించారు.