కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్( Rajinikanth ) కెరీర్ లో మరపురాని సినిమాలలో చంద్రముఖి ( Chandramukhi )ఒకటి.ఈ సినిమాను ఇప్పుడు కూడా మరోసారి చూసేందుకు ఆడియెన్స్ రెడీగా ఉంటారు.ఈ సినిమా రిలీజ్ అయ్యి దాదాపు రెండు దశాబ్దాలు అవుతుంది.2005 లో రిలీజ్ అయిన ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగు భాషలో కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.
మరి దాదాపు 18 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ ను తెరకెక్కించారు.పి వాసు డైరెక్ట్ చేయగా ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ భారీ స్థాయిలో పాన్ ఇండియన్ మూవీగా నిర్మించారు.ఇన్నేళ్ల తర్వాత సీక్వెల్ గా చంద్రముఖి 2 రాబోతుంది అని తెలియడంతో చంద్రముఖి ఫ్యాన్స్ ఎగ్జైట్ గా ఎదురు చూస్తున్నారు.అయితే ఈసారి రజినీకాంత్ బదులుగా రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్నాడు.
చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా చంద్రముఖి 2 తెరకెక్కుతుండగా ఈ సినిమా షూట్ ఇప్పటికే పూర్తి అయ్యింది.దీంతో ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసారు మేకర్స్.ఈ క్రమంలోనే చంద్రముఖి 2 ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసారు.కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయిన ఈ ఫస్ట్ లుక్ పై పాజిటివ్ కంటే నెగిటివ్ కామెంట్స్ ఎక్కువుగా వినిపిస్తున్నాయి.
ఇది సీక్వెల్ సినిమాలా లేదు అని చంద్రముఖి స్పూఫ్ లా ఉంది. రాఘవ లారెన్స్( Raghava Lawrence ) కూడా రజినీకాంత్ వాకింగ్ స్టైల్ కాపీ చేసినట్టు ఉంది అంటూ టాక్ వస్తుంది.దీంతో ఎంతో ఆశగా ఎదురు చూసిన చంద్రముఖి లవర్స్ కు నిరాశ ఎదురయ్యింది.మరి ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ( Kangana Ranaut )హీరోయిన్ గా నటిస్తుంది.
ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.ఇక ఈ సినిమా వినాయక చవితి కానుకగా రాబోతుంది.