డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu ) పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.
దాదాపు మూడు రోజుల నుండి చంద్రబాబు పర్యటన ఈ ప్రాంతంలో కొనసాగుతూ ఉంది.పర్యటనలో భాగంగా రైతులతో సమావేశమయ్యారు.
సర్పంచ్ లతో కూడా ప్రత్యేకంగా బేటి కావడం జరిగింది.నేడు అమలాపురంలో నిర్వహించిన “భవిష్యత్తు గ్యారెంటీ” కార్యక్రమంలో గడియార స్తంభం సెంటర్లో బహిరంగ సభలో జగన్ పై చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్( jagan ) ప్రజల రక్తం తాగే జలగనీ విమర్శించారు.
ప్రతిరోజు ప్రజల డబ్బులు దోచుకుంటున్న దుర్మార్గులని మండిపడ్డారు.
ఈసారి ఎన్నికలలో జగన్ చిత్తగా ఓడిపోవడం గ్యారంటీ అని జోష్యం చెప్పారు.రాష్ట్రంలో ఇసుక దోపిడీ ఎక్కువ అయిపోయిందని ఆరోపించారు.
దోపిడీలో భాగంగా విశాఖలో రుషికొండకు కూడా గుండు కొట్టారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.బాబాయ్ హత్య కేసులో తమ్ముడు అవినాష్ రెడ్డిని( Avinash Reddy ) కాపాడుకునేందుకు సీఎం జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
కేంద్రం వద్ద పోలవరం నిధులు గురించి సీఎం జగన్ ఒక్కసారైనా మాట్లాడారా అని ప్రశ్నించారు.కేంద్రం మెడలు వంచుతానని చెప్పి.
మెడలు దించారని చంద్రబాబు విమర్శలు చేశారు.కేసుల మాఫీ కోసం ఎంపీ సీట్లు అమ్ముకున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.
సీఎం జగన్ తీరు వాళ్ళ ఆక్వా పరిశ్రమ వెంటి రైటర్ పై ఉందని విమర్శించారు.