పులివెందుల( Pulivendula ) అనగానే వైఎస్ కుటుంబానికి కంచుకోట అనే సంగతి అందరికీ తెలిసిందే.ఇక్కడ వైఎస్ కుటుంబానికి తప్పా వేరే నాయకుడికి గాని పార్టీ గాని స్థానం లేదు అన్న రీతిలో అక్కడి ప్రజలు వ్యవహరిస్తూ ఉంటారు.
అందుకే ఎప్పుడు ఎన్నికలు వచ్చిన ఇక్కడ వైఎస్ కుటుంబమే కనీ విని ఎరుగని రీతిలో మెజారిటీ సాధిస్తుంది.ఇక గత ఎన్నికల్లో పులివెందుల నుంచి పోటీ చేసిన వైఎస్ జగన్ కు 90 వేల మెజారిటీ కట్టబెట్టారు అక్కడి ప్రజలు.
మరి ఈ స్థాయిలో వైఎస్ కుటుంబానికి విధేయత చూపే పులివెందులలో పాగా వేయాలని చంద్రబాబు గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

మరి అది సాధ్యమేనా అంటే కష్టమే అనే సమాధానం ఎక్కువగా వినిపిస్తోంది.అయితే టీడీపీ శ్రేణులు మాత్రం వైనాట్ పులివెందుల అంటున్నారు.మరి పులివెందులపై పట్టు సాధించేందుకు చంద్రబాబు ఎలాంటి వ్యూహరచన చేస్తున్నారు.
జగన్ ను ఢీ కొట్టేందుకు ఎవరిని బరిలోకి దించనున్నారు అనే ప్రశ్నలు రావడం సహాయం.అయితే వీటన్నిటి కంటే ముందు ప్రజలను టీడీపీ వైపు తిప్పుకోవడం చాలా ముఖ్యం.
ప్రస్తుతం ఆ దిశగానే చంద్రబాబు ప్లాన్స్ వేస్తున్నట్లు తెలుస్తోంది.చంద్రబాబు హయంలో పులివెందులలో ఎలాంటి అభివృద్ది జరిగింది.? ప్రస్తుతం పులివెందులపై జగన్ వైఖరి ఏంటి ? జగన్ ఏమైనా అభివృద్ది చేశారా ? ఇలాంటి ప్రశ్నలను ప్రజల మదిలో నిలిపి ప్రజల దృష్టిని ఆకర్శించేందుకు టీడీపీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

ఎందుకంటే పాదయాత్రలో భాగంగా లోకేశ్ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఆ విషయం స్పష్టంగా అర్థమౌతోంది.90 వేల మెజారిటీతో గెలిచిన జగన్ పులివెందులకు చేసిందేంటి అని, పులివెందులకు ఒక్క పరిశ్రమైన తీసుకొచ్చాడా ? ఒక్క రూపాయి అయిన నిధులు కేటాయించాడా అంటూ ప్రశ్నలు సంధించాడు లోకేశ్.చంద్రబాబు హయంలో అన్నీ నియోజిక వర్గాల మాదిరిగానే ఇక్కడ అభివృద్ది చేశామని, పులివెందుల కు నీరు ఇచ్చింది టీడీపీనే అని చెప్పుకొచ్చారాయన.
కాగా పులివెందుల వైసీపీ గట్ట అనే నినాదాన్ని మార్చి వచ్చే ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ జెండా ఎగురవేస్తామని చెప్పుకొచ్చారు నారా లోకేశ్.మరి పులివెందులలో ప్రజలు టీడీపీని ఎంతవరకు ఆధారిస్తారో చూడాలి.